తెలంగాణ

రాష్ట్రంలో విద్యా రంగానికి చెదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత విద్యారంగం వికాసానికి బదులు చెదలు పట్టాయని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాటలు గురివింద గింజ సామెతలా ఉన్నాయని అన్నారు. విద్యకు సంబంధించిన ఒక విధానం అంటూ ఈ రాష్ట్రానికి ఉందా అని ఆయన నిలదీశారు. ప్రాధమిక స్థాయి నుండి యూనివర్శిటీ స్థాయి వరకూ అన్ని దశల్లో విద్యను, విద్యాసంస్థలను భ్రష్టుపట్టించారని అన్నారు. 70వేల పుస్తకాలు చదివానని చెబుతున్న సీఎం విద్యారంగాన్ని ఎందుకు సంస్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పూర్వ విద్యను అమలు చేయకపోవడం అంటే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. ప్రతి సారీ గురుకులాల గురించి గొప్పలు చెప్పడం వినా, మరో మాట లేదని అన్నారు. స్కూళ్లు, ఆధునికీకరణ, సిలబస్, ప్రణాళికల రూపకల్పనలోనూ, రిక్రూట్‌మెంట్‌లోనూ, పదోన్నతుల విషయంలో ఒక విధానాన్ని పాటించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకపోవడం వల్ల పరిస్థితి అతలాకుతలం అయ్యిందని చెప్పారు. స్కూళ్లలో సరిపడా టీచర్లు లేరని, జూనియర్,డిగ్రీకాలేజీల్లో లెక్చరర్లు లేరని, ప్రిన్సిపాల్స్ ఇన్‌ఛార్జిలే ఉన్నారని, పార్టుటైమ్, గెస్టు లెక్చరర్ల వల్ల ఆయా విద్యాసంస్థలపై బాధ్యత ఎలా ఉంటాదని ప్రశ్నించారు. యూనివర్శిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ఎప్పటికపుడు చెబుతున్నారే తప్ప భర్తీ చేపట్టలేదని పేర్కొన్నారు. యూనివర్శిటీలకు వీసీలు లేరని, నెలలు, సంవత్సరాల తరబడి ఇన్‌చార్జి వీసీలే ఉండటంతో యూనివర్శిటీల వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. సీనియర్ అధికారులను ఇన్‌చార్జిలుగా పెట్టామని ప్రభుత్వం చెబుతోందని వారి సొంత శాఖల పనులతో వారు ఎంతో బిజీగా ఉంటున్నారని, యూనివర్శిటీలపై దృష్టి పెట్టే సమయం వారికి లేదని అన్నారు. యూనివర్శిటీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు పద్ధతి ప్రకారం జరగడం లేదని ఆరోపించారు. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన విద్యార్థుల డాటాను వెబ్ పోర్టల్స్‌లో పెట్టాలని యూజీసీ సూచించినా, చాలా కాలేజీలు వెబ్ సైట్లు నిర్వహించడం లేదని వెబ్ పోర్టల్స్ ఉన్నా ఆ జాబితాలను పెట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అంతా అవాస్తవాలు చెబుతోందని, హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనంతరం అక్కడ ప్రసంగించిన సీఎం ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం కేంద్రంతో కొట్లాడతానని చెప్పారని, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించకపోవడం వల్లనే జాప్యం జరిగిందని అన్నారు.