తెలంగాణ

‘పల్లా’కు రైతు సమన్వయ ‘పగ్గాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పల్లా నియామకానికి సంబంధించి అధికారికంగా జీఓ వీలైనంత త్వరగా జారీ చేయాలని శనివారం ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. పల్లాను అధ్యక్షుడిగా నియమిస్తూ, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలో నియమించాలని సీఎం సూచించారు. ఇలా ఉండగా రైతు సమన్వయ సమితిలను అట్టడుగు స్థాయి నుండి బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. 2020 జూన్ లోగా గ్రామ స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు సమగ్రంగా కమిటీల నియామకాలు పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు.
రైతుల సమస్యలపై అట్టడుగు స్థాయి నుండి చర్చించేందుకు క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. రైతులు విత్తనాలు వేసే సమయం నుండి మొదలుకుని పంటలను మార్కెట్లకు తరలించి, వాటికి కనీస మద్దతు ధర లభించేంత వరకు ఈ సమితిలు సమర్థతతో, సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మూడు, నాలుగు రోజుల్లోగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర రైతు సమితి తొలి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని గత ఏడాది ప్రభుత్వం నియమించింది. అయితే గుత్తా శాసన మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షస్థానం ఖాళీ అయింది. పైగా వివిధ కారణాల వల్ల రైతు సమన్వయ సమితిలు చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయలేదు. నియమావళి ప్రకారం రాష్ట్ర స్థాయి సమితిలో సభ్యులుగా రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలు, నిపుణులను నియమించాల్సి ఉంటుంది. రాష్టస్థ్రాయి సమితిలో 42 మంది సభ్యులను నియమించాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితిలో 24 మంది, మండలస్థాయి సమితిలో 24 మంది, గ్రామ స్థాయి సమితిలో 15 మంది రైతులను సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,61,000 మంది సమితిలో సభ్యులుగా మారతారు.
రాష్ట్ర రైతు సమన్వయ సమితిని పటిష్టం చేయాలని, రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌ను దీని పరిధిలో పనిచేసేలా చూడాలని తొలుత భావించారు. కారణాలు ఏవైనా గతంలో గ్రామస్థాయి మొదలుకుని రాష్టస్థ్రాయి వరకు రైతు సమన్వయ సమితిలు చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయలేదు. ఇప్పుడు మళ్లీ దీనికి జీవం పోస్తున్నారు.

*చిత్రం...తనను రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్‌ను కలసి ధన్యవాదాలు చెబుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి