తెలంగాణ

జేఏసీ నేతల దీక్షలు భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షలను ఆదివారం పోలీసులు భగ్నం చేశారు. తమ నేతల అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు బస్ డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న కార్మికులను చెదరకొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వైఖరి నెలకొంది. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కోపాద్రిక్తులైన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు తమ సొంత నివాసాల్లో చేపట్టిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. శని, ఆదివారం సాయంత్రం వరకు దీక్షలో ఉన్న నేతల్లి బలవంతంగా పోలీసులు దీక్షలను భగ్నం చేయడంతో పాటు అరెస్టు చేసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అరెస్టుకు ముందు బీఎన్ రెడ్డి కాలనీలో ఉన్న జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా చోటు చేసుకుంది. సొంత నివాసంలో దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి ఇంటికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. తొలుత పోలీసులు ఇంటి తలుపులు తీయాలని అశ్వత్థామరెడ్డికి సూచించారు. అయితే, ససేమిరా తలుపులు తీయనని ఆయన మొండికేయడంతో పోలీసు బలవంతంగా తలుపులను తొలగించారు. కుటంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని మహిళా పోలీసులు నెట్టివేశారు. ఇంటి పైగదిలో ఉన్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు బలవంతంగా బయటికు తీసుకువచ్చారు. రెండు రోజులుగా దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆరోగ్యం క్షీణించనట్లు సూచించారు. తక్షణం దీక్ష విరమించకపోతే ప్రమాదమని ఆయనకు సూచించారు. పోలీసులు అశ్వత్థామరెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో అశ్వత్థామరెడ్డి వైద్యపరీక్షలు చేయించుకున్నా, తాను దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అయితే, దీక్షకు అనుమతించమని ఆయనకు పోలీసులు సూచించారు. కాగా, మరో జేఏసీ కో- కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను సైతం పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్ రెడ్డి కాలనీలో సొంత నివాసంలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన దీక్షలో పాల్గొనడానికి వస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పహాడీషరీప్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజిరెడ్డి సొంత ఇంటిలోనే దీక్ష చేపట్టారు. ఆదివారం బలవంతంగా రాజరెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి రాజరెడ్డిని అరెస్టు చేశారు. ఆదివారం ఇరువురి నేతల అరెస్టులను ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. నేతల అరెస్టుల సమాచారం తెలుసుకున్న తోటి కార్మికులు ఆయా నేతల ఇంటికి భారీగా చేరుకున్నారు. పోలీస్ చర్యలు నశించాలని వారు నినాదాలు చేశారు. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని నినాదాలతో హోరెత్తించారు. ఇలా ఉండగా జేఏసీ నేతలు చేపట్టిన దీక్షలకు మద్దతు పలికిన మంద కృష్ణమాదిగను హబ్సిగూడలో పోలీసులు అరెస్టు చేశారు. అశ్వత్థామరెడ్డి దీక్షకు బీజేపీ నేతలు వివేక్, జితేందర్‌రెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. అరెస్టు అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాలను అణిచివేయడానకి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్‌లో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయన్నారు. 44 రోజులుగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం కేసీఆర్‌కు శాపంగా ఉంటుందన్నారు. కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న ఘటనల నేపథ్యంలో సీఎం మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. సీఎం తన విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.

*చిత్రాలు.. ఉస్మానియా ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు