తెలంగాణ

దీక్షలు విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో గత 45 రోజులుగా జరుగుతున్న సమ్మెపై మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంటామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెపై హైకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేస్తూ కార్మిక శాఖ కోర్టులో తేల్చుకోవాలని ఇటు జేఏసీ, అటు ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. దీంతో సమ్మెపై జేఏసీ నేతలు, విపక్షాల నేతలు తర్జనభర్జన చేశారు. సమ్మెపై ముందుకు పోవాలా? లేదా కొనసాగించాలా? అన్న అంశంపై జేఏసీ,
విపక్షాలు నేడు కీలక నిర్ణయం తీసుకుబోతున్నాయి. ఈ నేపథ్యంలో జేఏసీ నేతల కీలక నిర్ణయంపై కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 45 రోజులు సమ్మెలో పాల్గొన్న కార్మికుల్లో తదుపరి నిర్ణయం ఏమిటోనని ఆత్రుత వ్యక్తమవుతోంది. కాగా, జేఏసీ నేతలు మంగళవారం దీక్షలను విరమించారు. ఉస్మానియా ఆసుపత్రిలో దీక్షలను కొనసాగిస్తున్న జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజరెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను మందకృష్ణ మాదిగ విరమింపజేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు జడ్జిమెంట్‌ను కూలంకషంగా పరిశీలించిన అనంతరం సమ్మెపై మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో కార్మికులు పాల్గొంటారని ఆయన గుర్తు చేశారు. అయితే, మంగళవారం జరుపతలపెట్టిన సడక్ బంద్, రాస్తారోకోలను మాత్రం వాయిదా వేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా, సమ్మె ఉధృతం చేయడానికి జేఏసీ నేతలు చేపట్టిన దీక్షలకు పోలీసులు అనుమతించలేదు. దీంతో జేఏసీ నేతలు స్వగృహాల్లోనే దీక్షలు చేపట్టగా పోలీసులు బలవంతంగా వాటిని భగ్నం చేశారు. దీక్షలో ఉన్న జేఏసీ నేతలను అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. దీక్షలతో ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు సూచించినా ససేమిరా అంటూ జేఏసీ నేతలు దీక్షలను ఆసుపత్రిలోనే కొనసాగించారు. కాగా, సోమవారం హైకోర్టు సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేయడంతో జేఏసీ నేతల దీక్షలను విపక్షాల నేతలు విరమింపజేశారు. దీక్షలను విరమింపజేయడానికి వచ్చిన విపక్షాల నేతలు సమ్మెపై స్పందించారు. సమ్మెపై ప్రభుత్వం పైశాచిక చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు. ఆందోళనకు ప్రభుత్వం కుప్పకూలిపోతే, ఆ ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించుకోవడానికి చేపట్టిన సమ్మెను ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. పోరుబాట పట్టిన కార్మికుల శ్రమ వృథా కాదన్నారు. వేలాది మంది కార్మికుల ఉసురు ముఖ్యమంత్రికి తగలకపోదని ఆయన దుమ్మెత్తిపోశారు. పలువురు సీపీఎం, ప్రజా సంఘాలు, జేఏసీ నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
*చిత్రం... ఉస్మానియా ఆసుపత్రిలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డికి పండ్ల రసం ఇచ్చి దీక్షలు విరమింపజేయిస్తున్న మందకృష్ణ మాదిగ, కోదండరామ్, వివిధ పార్టీల నాయకులు