తెలంగాణ

తెలంగాణలో కలిసేందుకు ‘మహా’ సరిహద్దు గ్రామాలు తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: ఢిల్లీలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం పట్ల అప్రమత్తత అవసరం కాగా, ప్రభుత్వం చేపట్టిన హరితహారంను ఉద్యమంలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రూ. 7 కోట్ల లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు 717 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన సందర్బంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటంతో మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు తెలంగాణాలో కలిసేందుకు తీర్మానాలు చేస్తున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుండగా, అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, డబల్‌బెడ్‌రూం ఇళ్ల్లు, పంటపెట్టుబడి సహాయం తదితర పథకాలు దేశంలో కనిపించిన దాఖలాలు లేవని తెలిపారు. వీటికి ఆకర్షితులై మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు తెలంగాణలో కలిసిపోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు 30 రోజుల కార్యాచరణతో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలవాలని, ఇందుకోసం పెద్ద ఎత్తున చెట్లు పెంచడంతో పాటు సంరక్షించే బాధ్యతను చేపట్టాలని వివరించారు. కార్పొరేషన్ చైర్మెన్‌లు ప్రతాప్‌రెడ్డి, భూపతిరెడ్డి, భూంరెడ్డి, జెడ్‌పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్‌పీటీసీలు అమరావతి, మల్లేశం, బాలేషంగౌడ్, సుధాకర్‌రెడ్డి, లతా రమేశ్‌గౌడ్, బాలుయాదవ్, పాండుగౌడ్, ఎంబరి మంగమ్మ రాంచంద్రం, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, గడా అధికారి ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
సోషల్ మీడియా మోజుతో సమయాన్ని వృథా చేయొద్దు
యువతరం ప్రతి ఒక్కరూ కలలు కనాలని, కష్టపడి కలలను సాకారం చేసుకోవాలని.. లక్ష్యాన్ని ఎంచుకొని కఠోర శ్రమతో లక్ష్య సాధనకు కృషిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ప్రతి ఒక్కరూ ఆర్థిక సంపాదన వైపు వెళ్లాలని సూచించారు. యువత తన జీవితాన్ని మార్చుకోవటానికి ఇదోక సువర్ణ అవకాశమని.. మీరు వేసే ఒక్క అడుగుతోనే ప్రపంచం అంటే ఏమిటో తెలియటంతో పాటు జీవితం మారిపోతుందన్నారు. మనం చేసే పనితనంతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు ఉద్యోగమా? అని ఆలోచించకుండా చేసే పనిలో నిమగ్నమై మంచి ఉద్యోగిగా పేరు సంపాదించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి కంటే ప్రైవేటు ఉద్యోగులే అధిక ఆదాయం సంపాదించటంతో పాటు, పదోన్నతులు పొంది ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒకే రకమైన వేతనంతో స్థిరమైన జీవితాన్ని గడుపుతుండగా, ప్రైవేటు ఉద్యోగులు తమ తెలితేటలు, నైపుణ్యంతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగం చేసే సమయంలో క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. చిన్న వయస్సులో ఉద్యోగం పొందితే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో గర్వపడతారన్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక ధపాలుగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. అనేక మంది జాబ్‌మేళాలో ఉద్యోగం పొంది, సక్రమంగా ఉద్యోగం చేయలేక పోతున్నారని, ఈ లోపం ఎక్కడ ఉందో గుర్తించి సరిచేసుకోవటం నైతిక బాధ్యత అన్నారు. యువత సోషల్ మీడియా మోజులో పడి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సోషల్ మీడియాను అవసరానికి మించి వాడవద్దని సూచించారు. ప్రస్తుతం వేతనం తక్కువగా ఉన్న రానున్న రోజుల్లో అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుందన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికంటే రోజు వారి కూలీలే ఎక్కువగా సంపాదిస్తున్నారన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే తన ముఖ్య లక్ష్యమని, ఇందుకోసం తన వంతు పూర్తి సహాయ, సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్వహించిన జాబ్‌మేళాలో ఉద్యోగం రాని నిరుద్యోగులు నిరాశ చెందవద్దని ఆయన కోరారు. నిరుద్యోగుల కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పలు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి, నైపుణ్యాన్ని పెంపొందించి వచ్చే జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చే విధంగా తోడ్పాటు అందిస్తానన్నారు. ఆడపిల్లలు సైతం ఉద్యోగాలు చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. సిద్దిపేట మెగా జాబ్ మేళాలో 30 కంపెనీలు పాలుపంచుకోవటం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ కంపెనీల వద్ద నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ విజయ్‌కుమార్, నాయకులు వేలేటి రాధాకిషన్‌శర్మ, కొండం సంపత్‌రెడ్డి, పాల సాయిరాం, గ్యాదరి రవీందర్, సాకి ఆనంద్, మొయిజ్, నర్సింలు, నయ్యర్‌పటేల్, ఎర్ర యాదయ్య, మెర్గు మహేశ్, పెర్క బాబు, నాగరాజు, ఇర్షాద్‌హుస్సేన్, ప్రశాంత్, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
*చిత్రం... గజ్వేల్‌లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి హరీష్‌రావు