తెలంగాణ

ఆలయాల్లో కార్తీక సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 18: కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. మహాశివుడికి అభిషేకాలు, అర్చనలతో శివాలయాలు కిటకిటలాడాయి. నల్లగొండ పట్టణంలోని చారిత్రాక పానగల్ ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయాలు, బ్రహ్మంగారి గుట్ట కాశీవిశే్వశ్వర ఆలయం, సంతోషిమాతా ఆలయం, పట్టణంలోని రామకోటి స్థూప ఆలయం, రామగిరి రామాలయం, కామేశ్వర ఆలయం, దుర్గా ఆలయం, వీటీ కాలని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో కార్తీక మాస పూజలు, అభిషేకాలు, దీపారాధనలతో కిటకిటలాడాయి.
*చిత్రాలు.. నల్లగొండ జిల్లా ఛాయ సోమేశ్వర ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు
* ఛాయ సోమేశ్వర క్షేత్రం వద్ద కృష్ణా పుష్కరణిలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు