తెలంగాణ

సమ్మె యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు తీర్పు ప్రతి అందాకే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కోర్టు తీర్పు ప్రతి తమకు ఇంకా అందలేదని, పైగా దీనిపై తుది తీర్పు బుధవారం వెలువడనుండటంతో అప్పటివరకు ఆగుతామని చెప్పారు. తాము తుది నిర్ణయం తీసుకునే వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యాయ నిపుణులు, కార్మికులతో చర్చించాకే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. దీనికి మరో రెండు, మూడు రోజుల సమయం పట్టవచ్చని అన్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, సమ్మె కొనసాగించాలా? వద్దా? అనే అంశం పై చర్చించడానికి జేఏసీలోని ప్రధాన కార్మిక సంఘాలు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), ఎంప్లాయాస్ యూనియన్ (ఇసీ), స్ట్ఫా అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమై సమ్మె కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి వచ్చిన యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర సంఘాలు సమావేశమై అన్ని కోణాల నుంచి
సమాలోచనలు జరిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయానుసారమే నడుచుకున్నామని, సమ్మె విరమించాలా? వద్దా? అనే అంశంపై కూడా జేఏసీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోల నుంచి హాజరైన యూనియన్ల ప్రతినిధులు స్పష్టం చేశారు. అన్ని యూనియన్లకు చెందిన కార్మికుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో రాష్ట్ర జేఏసీ నేతలు చివరగా సమావేశమై చర్చించిన అనంతరం రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై విచారణను ముగిస్తూ ఇచ్చిన తీర్పు ప్రతి ఇంకా తమకు అందలేదని, అది వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఏ నిర్ణమైనా కార్మికుల నిర్ణయం మేరకే జేఏసీ తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. సమ్మె సందర్భంగా మరణించిన కార్మిక కుటుంబాలకు జేఏసీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఉద్యోగ భద్రతపై అనుమానాలు!
ఆర్టీసీ సమ్మెను విరమించినా ఉద్యోగ భద్రత ఉంటుందా? సమ్మె విరమిస్తే విధుల్లో చేర్చుకుంటుందా? సమ్మె చట్టబద్ధతపై కార్మిక శాఖ ఏం చెబుతుంది? అనే సందేహాలను కార్మికులు వ్యక్తం చేసినట్టు సమాచారం. హైకోర్టు చేతులు ఎత్తేశాక కార్మిక శాఖ చెప్పేది ఏమి ఉండదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే శాఖ అని జేఏసీ నేతలు కార్మికులకు నచ్చజెప్పినట్టు సమాచారం. సమ్మె విరమిస్తే బేషరతుగా విధుల్లో చేర్చుకుంటామని కనీసం ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని కార్మికులు సూచించినట్టు తెలిసింది. ఆర్టీసీ సమ్మెను సానుకూలంగా పరిష్కరించాలని హైకోర్టు చేసిన సూచన మేరకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే అఖిల పక్ష పార్టీలతో చర్చించి కార్యాచరణన ప్రకటిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు సూచనల మేరకు నడచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

*చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి