తెలంగాణ

విమానాశ్రయాల ఏర్పాటుపై అధ్యయనం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆరు నగరాల శివార్లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. ఆరు చోట్ల విమానాశ్రయాల ఏర్పాటుపై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. ప్రస్తుతం సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నివేదికను పూర్తి చేసే విషయమై అథారిటీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరలో ఈ నివేదిక రాష్ట్రప్రభుత్వానికి అందుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిజామాబాద్, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబ్‌నగర్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్ జిల్లాలు చిన్న విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం సూత్రప్రాయంగా
నిర్ణయించింది. ఇక్కడి నుంచి 40నుంచి 50 సీట్లున్న విమానాలను నడిపేందుకు వీలుగా వౌలిక సదుపాయాలను విమానాశ్రయాల్లో కల్పించనున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిమిత్తం నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్త గూడెంలో భూములను గుర్తించారు. పెద్దపల్లిలోని బసంతనగర్‌లో ,వరంగల్ అర్బన్ వద్ద మామ్నూరు గ్రామం వద్ద, మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల మండలం గుదిబండ గ్రామం వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజమాబాద్ జిల్లాలో జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు. చిన్న విమానశ్రయాలు ఏర్పాటు చేసే నగరాల వద్ద రన్ వే 1500 మీటర్ల వరకు అభివృద్ధి చేస్తారు. విమానాశ్రయాల ఏర్పాటు బాధ్యతపై ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను కనె్సల్టెన్సీ సంస్థగా నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ వద్ద నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు, కార్గోకు సేవలు అందిస్తోంది. పాత బేగంపేట విమానాశ్రయాన్ని అత్యవసర సర్వీసులు, వీవీఐపీ రాకపోకలకు, ఏవియేషన్ శిక్షణ నిమిత్తం ఉపయోగిస్తున్నారు.