తెలంగాణ

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 19: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ షేక్ యాకూబ్‌పాష (53) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందాడు. జఫర్‌గడ్‌కు చెందిన షేక్ యాకూబ్‌పాష నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా గత 30 ఏళ్ల నుండి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 30 ఏళ్ల క్రితమే నర్సంపేట డివిజన్‌లోని చెన్నారావుపేట మం డలం ఉప్పరపల్లికి వచ్చి స్థిరపడ్డాడు. ఆర్టీసీ నిరవధిక సమ్మెలో భాగంగా ప్రతి నిత్యం యాకూబ్‌పాష నర్సంపేట డిపోకు వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అయితే గత ఐదు రోజులుగా ఉద్యోగం ఉంటుందో పోతుందోననే తీవ్ర మానసిక వేధనతో గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోర్టు తీర్పు ఎలా వస్తుందోననే భయాందోళనలతో మంగళవారం మధ్యాహ్నాం ఉప్పరపల్లిలోని ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్య చికిత్స పొందుతూ యాకూబ్‌పాష మంగళవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో మృతిచెందాడు. మృతుడికి భార్య రషీదా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా యాకూబ్‌పాష అంత్యక్రియలను ఆయన స్వస్థలం అయిన జఫర్‌గడ్‌లో బుధవారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. యాకూబ్‌పాష మృతితో నర్సంపేట డిపోలో విషాదం నెలకొంది.
మృతుడి కుటుంభానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు గొలనుకొండ వేణు, వేముల రవి, బత్తిని రవి, యాదగిరి, రంగయ్య, నాగిశెట్టి ప్రవీణ్, ఏఎం రావులు తమ ప్రగాడ సంతాపం తెలిపారు.
*చిత్రం...డ్రైవర్ యాకూబ్‌పాష
*అంతర చిత్రంలో ఫైల్‌ఫొటో