తెలంగాణ

సొంత పనులకు విద్యార్థిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, నవంబర్ 19: పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థిని సొంత పనులకు ఉపయోగించుకున్న ఆరోపణ ఎదుర్కొంటున్న మోత్కూర్ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల ఎస్‌వో యాదమ్మను మంగళవారం జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీఈవో జైని చైతన్య ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఎంఈవో రాజారాములు ముత్తిరెడ్డిగూడెం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సునీత విచారణ జరిపారు.
మోత్కూర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న నల్లగొండ జిల్లా చింతబావిగూడెంకు చెందిన కే.నాగమణిని ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎస్‌వో యాదమ్మ, తన ఇంట్లో ఉంచుకొని సొంత పనులు చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎస్‌వోపై విచారణ చేపట్టారు.