తెలంగాణ

కాళేశ్వరం పేరుతో రూ. వేల కోట్ల్లు దండుకున్న టీఆర్‌ఎస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, నవంబర్ 19: సీఎం కేసీఆర్ ప్రభుత్వంను కోర్టు బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులకే దక్కిందని, ఆర్టీసీ ఆస్తులను సీ ఎం కేసీ ఆర్ దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాదిగ రిజరేష్వన్ పోరాట సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్‌రావుతో కలిసి ఆయన దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపి కార్మికులను నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికి కార్మికులు అడ్డుపడుతున్నారని కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అయిన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన్నట్లు తెలిపారు.
కేసీఆర్ కార్మికుల పక్షాన లేకపోవడం కేవలం ఆయన స్వార్ధమేనాని అక్రమ సంపాదన కొరకే కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీమాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పరిపాలన కేసీ ఆర్ పాలనతో పోలిస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన లక్ష రేట్లు నయమన్నారు. ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా ప్రజలకు ఉందన్నారు. హైకోర్టు చెరో మెట్టు దిగి సమస్యను పరిష్కారించుకోవాలని చెప్పితే ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారించాలి డిమాండ్ చేస్తుంటే వారిపై ప్రభుత్వం కాల్పులు చేయాలనే ప్రయత్నం చేశారని, విషయం ముందే లీక్ కావడంతో వారి ప్రయత్నం విరమించుకోవడం జరిగిందన్నారు. కార్మికులపై వ్యతిరేకత రావాలని పండుగ ముందు కార్మికులు సమ్మె చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కార్మికుల తీరును విమర్శిస్తూ కార్మికుల లోకం పై లేనిపోని అరోపనలు చేస్తూప్రజల్లోప్రభుత్వం మెప్పు పొందే ప్రయత్నం చేశారన్నారు. కార్మికులు ఎప్పుడు గెలుస్తారో తెలియదు కాని కార్మికులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి కార్మికులే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీ ఆర్ వందలాది పుస్తకాలు చదివినా చెప్పకోవడం అలవాటే కాని చదివిన పుస్తకాలు మంచివి కావు అందుకే కేసీ ఆర్ పాలన నియంతగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్‌రావు డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైనదేనాని తెలిపారు. కార్మికులకు బియ్యం అందజేశారు. ఆర్టీసీ జే ఎసీ నాయకులు గోపాల్. అజీమ్. లింగం, స్వామి, రమేశ్, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, బాల్లేశ్, వంశీ, రవీందర్, ప్రవీణ్ ఉన్నారు.

*చిత్రం...మహిళా కార్మికురాలికి బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం