తెలంగాణ

రెవెన్యూ సిబ్బందిపై మరో పెట్రోలు దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 19: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం నుంచి ఇంకా రెవెన్యూ అధికారులు, సిబ్బంది తేరుకోకముందే భూ సమస్యలు పరిష్కరించడం లేదని ఆగ్రహించిన ఓ రైతు మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్‌లో సిబ్బందిపై పెట్రోల్‌తో దాడి మరోమారు కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన జీల కనుకయ్య అనే రైతు మంగళవారం ఉదయం రెవెన్యూ అసిస్టెంట్ రామచంద్రన్, సిబ్బందిపై పెట్రోల్‌తో దాడికి యత్నించగా అప్రమత్తమైన సిబ్బంది తమ స్థానాల్లోంచి లేచి పరుగులు పెట్టారు. దీంతో కంప్యూటర్, కుర్చీలపై పెట్రోల్ పడింది. తేరుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన రెవెన్యూ కార్యాలయానికి తరలి వచ్చిన పోలీసులు రైతు కనుకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రైతును విచారించగా తన భూమికి సంబంధించిన పట్టా జారీ చేయకపోవడంతోనే సిబ్బందిపై పెట్రోల్ దాడికి పాల్పడినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. భూమి పట్టాకోసం మూడేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, అయినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేకే రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ దాడికి దిగినట్లు ఆవేదనతో వెల్లడించారు. భూమిపై అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తుందని, ఆ కారణంగానే పట్టాలు ఇవ్వలేదని తహశీల్ కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. రైతు కనుకయ్య పక్కా ప్రణాళికతోనే దాడి చేయడానికి వచ్చాడని, ఉదయం 10 గంటల నుంచే పెట్రోల్ బాటిల్‌తో తహశీల్ ఎదుట కాచుకుని కూర్చున్నాడని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని విధులకు హాజరవుతున్నామని, ఇలాంటి దాడులతో పని చేయాలంటేనే ప్రాణాలు పోతాయనే భయమేస్తోందని రెవెన్యూ సిబ్బంది ఆవేదన వెలిబుచ్చారు. తహశీల్ సిబ్బందిపై పెట్రోల్ దాడికి దిగిన కనుకయ్యను అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలోపడినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

*చిత్రాలు.. కుర్చీలు, కంప్యూటర్‌పై పెట్రోల్ పడిన దృశ్యం, పోలీసుల అదుపులో రైతు కనుకయ్య, ఆరా తీస్తున్న పోలీసులు