తెలంగాణ

ఉద్యాన పంటలతో ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: రైతులకు ఆదాయం వచ్చేందుకు ఉద్యాన పంటలు దోహదపడతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయంలో మొదటి అంతర్ కళాశాల క్రీడాపోటీలను గురువారం ప్రారంభిస్తూ, ఉద్యాన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవాన్ని త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. ములుగులో కొత్త ఉద్యాన కళాశాలను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలకు అక్రిడిటేషన్లు వస్తున్నాయన్నారు. మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమిలను సమానంగా చూడాలన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం 2020 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. విశ్వవిద్యాలయం ఏర్పడ్డ తక్కువ కాలంలోనే విద్యార్థులకు అవసరమైన వౌలికసదుపాయాలను కల్పించామని వివరించారు. ఉద్యాన పంటలకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ (జీడిమెట్ల), ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను విద్యార్థులు ప్రయోగాలకు వాడుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. బోధన, బోధనేతర సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని పార్థసారథి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రవీంద్రరెడ్డి, డీన్ డాక్టర్ ఎం. విజయ తదితరులు పాల్గొన్నారు.