తెలంగాణ

మే 10న క్లాట్-2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల, ఏడాది వ్యవధి ఉన్న ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి మే 10వ తేదీన ద కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) -2020 నిర్వహించాలని గురువారం నాడు కాన్సార్టియం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల చివరి వారంలో వెలువడనుంది. దరఖాస్తులను జనవరి 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. బెంగలూరులో జరిగిన కాన్సార్టియం భేటీకి ప్రస్తుత చైర్మన్ , హైదరాబాద్ నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్త్ఫా అధ్యక్షత వహించారు. దేశంలోని వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఈ భేటీకి హాజరయ్యారు. యూజీ అడ్మిషన్లకు నిర్వహించే క్లాట్ పరీక్షలో కొన్ని మార్పులు చేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. పరిణామాత్మక విశే్లషణలు, ఆంగ్లం, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్ తదితర అంశాలపై కూడా ప్రశ్నలు సంథించనున్నారు. ప్రస్తుత ప్రశ్నాపత్రంలో 200 ప్రశ్నలు ఇస్తుండగా, దానిని 120 నుండి 150 ప్రశ్నలకు తగ్గించాలని నిర్ణయించారు. 200 ప్రశ్నలకు 120 నిమిషాల వ్యవధిలో సమాధానం రాయమనడం సబబుకాదని ఫైజాన్ ముస్త్ఫా కాన్సార్టియం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని అన్నారు. రెండు గంటల వ్యవధిని కొనసాగిస్తూనే ప్రశ్నల సంఖ్య తగ్గిస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈసారి కూడా ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు. పీజీ ప్రవేశపరీక్షలోనూ వ్యాస ఆధారిత ప్రశ్నలు కొనసాగించాలని నిర్ణయించారు. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశానికి ఈసారి కటాఫ్ మార్కులు నిర్ణయించనున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ త్వరలో సమావేశమై తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది. అదే విధంగా వివిధ విశ్వవిద్యాలయాల్లోని బోధన సిబ్బందికి నూతన బోధన పోకడలపై శిక్షణ ఇస్తారు. అదే విధంగా విద్యార్థులకు సైతం స్కాలర్‌షిప్‌లను, ఫీజు రాయితీలను కల్పించాలని నిర్ణయించారు.
క్లాట్ కాన్సార్టియం అధ్యక్షుడిగా భోపాల్ ఎల్‌ఎల్‌ఐయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ విజయకుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పంజాబ్ ఆర్‌జీఎన్‌యుఎల్ వీసీ ప్రొఫెసర్ పరంజిత్ ఎస్ జైస్వాల్ ఎన్నికయ్యారు. క్లాట్ కన్వీనర్‌గా ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలరాజ్ చౌహాన్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు, ప్రొఫెసర్ వీ కేశవరావు ఎన్నికయ్యారు.