తెలంగాణ

విద్యా కమిటీలు, నేతల భాగస్వామ్యంతో పాఠశాల విద్య బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: త్వరలోనే విద్యా కమిటీల ఎన్నికలు జరుగుతాయని, విద్యా కమిటీలు, ప్రజా ప్రతినిధులను పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములను చేస్తే పాఠశాల విద్య అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని విద్యాప్రమాణాలు మెరుగు అవుతాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎస్‌సీఈఆర్‌టీలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పరీక్షల్లో విజయం సాధించేందుకు, వత్తిడిని తట్టుకునేందుకు అవసరమైన మెలుకువలను విద్యార్థులకు అందించేందుకు పాఠశాల స్థాయిలో కౌనె్సలర్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలను మెరుగుపరిచేందుకు వీరి నియామకం దోహదపడుతుందని అన్నారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను పాఠశాలల్లో చేరుస్తున్నా హాజరుశాతం ఎందుకు తగ్గుతుందో పరిశీలించాలని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచితే, ఉత్తమ ఫలితాలను సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించి ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలను దీటుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ఇతర వౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు, ప్రాధాన్యతాపరంగా ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులను స్వచ్ఛ కమిటీలో భాగస్వామ్యులను చేయాలని మంత్రి సూచించారు. విద్యా కేలండర్‌కు అనుగుణంగా సిలబస్‌ను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నం క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో జిల్లా విద్యాశాఖాధికారులు ముఖ్య పాత్ర పోషించాలని మంత్రి కోరారు. విద్యారంగంలో ఉన్నత ప్రగతి సాధించడం ద్వారా బంగారుతెలంగాణను నిర్మించుకుందామని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడి శభాష్ అనిపించుకునే నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, తల్లిదండ్రుల ఆకాంక్షలను నిజం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి దేశంలో తెలంగాణ విద్యను అగ్రగామిగా చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రైవేటు విద్యాలయాల కంటే మెరుగైన సదుపాయాలను ప్రభుత్వ విద్యాలయాల్లో కల్పిస్తున్నామని అన్నారు. విద్యకు ఏటా విద్యాశాఖ నుండి 10వేల కోట్లు, ఇతర సంక్షేమ శాఖల నుండి 8వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బీ జనార్ధనరెడ్డి, విద్యాశాఖ కమిషనర్ టీ విజయకుమార్‌తో పాటు అదనపు డైరెక్టర్లు, వివిధ విభాగాల డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలు పాల్గొన్నారు.