తెలంగాణ

ప్రకృతిని పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: ప్రకృతిని మనం రక్షిస్తే...ప్రకృతే మనను రక్షిస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భావి తరాలకు అందించే గొప్ప వరం ఏదైనా ఉందంటే అది ప్రకృతియేనని అన్నారు. ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమానికి ఎంపి సంతోష్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రీన్ చాలెంజ్ స్వీకరించే ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని భాగస్వామ్యం చేయాలన్నారు. ఎఎటీవీ అసోసియేషన్ నాయకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం గొప్ప కార్యక్రమని కొనియాడారు. ఇదే స్పూర్తితో ఎంపి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఖడంతరాలను దాటి అప్రతిహతంగా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. గ్రీన్ చాలెంజ్‌లో ఇప్పటికే మూడు కోట్ల అరవై లక్షలకు చేరుకుందని గుర్తు చేశారు. సమాజంలో కళాకారులను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారని, అందుకే గ్రీన్ చాలెంజ్‌లో టీవీ, సినీ కళాకారులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని కాదంబరి అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ నటులు వినోద్ బాల, లోహిత్ భార్గవ, శశాంక, నాగమణి, కౌశిక్, రాం జగన్, రాగిణి, రాగ మాధురి, మధు, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...హైదరాబాద్‌లో ఆదివారం గ్రీన్ చాలెంజ్ ప్రతిజ్ఞ చేయస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్