తెలంగాణ

మెట్రో సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: తాను ప్రజా జీవితంలో ఉన్నా మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం రాలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెట్రో రైల్లో సతీసమేతంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణికులకు సౌకర్యాలు మంచిగా ఉన్నాయని మంత్రి కితాబ్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు ఎక్కాల్సిన మంత్రి, మెట్రోరైలు ఎక్కి ప్రయాణికులను ఆశ్చర్యపర్చారు. ఆదివారం సెలవు రోజు సరదాగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మెట్రో రైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఎర్రమంజల్ నుంచి ఎల్‌బీ నగర్‌కు వరకు ప్రయాణించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజా రవాణాలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఎలా స్పందిస్తారోనని తెల్సుకోవడానికి మంత్రి మెట్రో ఎక్కాశారు. అయితే మెట్రో రైలు ఎక్కేసరికి ఆర్టీసీ బస్సుల గురించి తెలుసుకోవడం మర్చిపోయారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌బీ నగర్ ప్రాంతంలో బందువుల ఫంక్షన్‌కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సతీసమేతంగా మెట్రోల్ రైల్లో ప్రయాణించారు. మెట్రో రైల్లో మంత్రి తొలిసారి ప్రయాణించారు. హైదరాబాద్‌లో మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ప్రజా జీవితంలో ఉన్నా నాకు మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం రాలేదన్నారు. మెట్రో రైల్లో ఎర్రమంజిల్ నుంచి ఎల్‌బీ నగర్ వరకు మంత్రి నిలబడి ప్రయాణం చేశారు. మెట్రో రైలు ప్రయాణం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. గతంలో కంటే ప్రస్తతం మెట్రోలో ప్రయాణించే సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రతిరోజు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ప్రయాణికులను మెట్రో చేరవేస్తోందన్నారు. మెట్రోలో ప్రయాణికులు మంత్రితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. మెట్రో అధికారులు సైతం మంత్రితో సెల్ఫీలు దిగారు. మెట్రో రైలు నుంచి మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో ఫోన్‌లో మంత్రి మాట్లాడుతూ మెట్రో సేవల పట్ల ప్రయాణికులు సంతృప్తిని వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
ప్రజల రద్దీ దృష్ట్యా రైలు బోగీలు పెంచాల్సిన అవసరం ఉందని మెట్రో ఎండీకి మంత్రి సూచించారు.
*చిత్రం...హైదరాబాద్‌లో ఆదివారం మెట్రో రైల్‌లో ప్రయాణిస్తున్న రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి