తెలంగాణ

విద్య, వైద్యం, ఇల్లు, ఆహారం బాధ్యత ప్రభుత్వాలదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: ప్రతి పౌరునికి విద్యా, వైద్యం, ఆహారం, ఇల్లును సమకూర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని 12 శతాబ్ధంలోనే బసవేశ్వరుడు చెప్పారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బసవేశ్వరుని బోధనలు ప్రభుత్వాలకు ధిక్సూచి లాంటివని చెప్పారు. బసవేశ్వరుని బోధనలు ఆచారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రజాప్రతినిధులకు సూచిస్తుంటారని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటకలోని బసవ కళ్యణ్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఏర్పాటు 40వ బస తత్వా అనుభవ మంటప ఉత్సవాలకు మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వాలు ఏ విధంగా అండగా ఉండాలో ఆ రోజుల్లోనే బసవేశ్వరుడు బోధించారన్నారు. ఆ స్వామిజీ బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రభుత్వాలకు ఆచరనీయమని అభిప్రాయపడ్డారు. బసవేశ్వరుని బోధనలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు, పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా, పంటల సాగుకు పెట్టుబడిని అందించిన తొలి రాష్ట్రం తెలంగాణనేనని, ఈ ఘనత తమ సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై బసవేశ్వరుని విగ్రహం పెట్టాలని సీఏంను కోరిన గంటలోనే జీవో ఇచ్చి నెల రోజుల్లో విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి గుర్తు చేశారు. భక్తి కంటే సద్భావన, సత్ప్రవర్తన ముఖ్యమని, ఎన్ని పూజలు చేసినా ఇవీ లేకపోతే వృధానేనని బసవేశ్వరుడి బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. ఆనాడే ప్రజల్లో ఉంటే మొడ నమ్మకాలను పారద్రోలేందుకు బసవేశ్వరుడు కృషి చేశారని చెప్పారు. బసవేశ్వరుని జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చడానికి, అలాగే హైదరాబాద్‌లో బసవ మందిర నిర్మాణానికి స్థలం, నిధుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.