తెలంగాణ

ఆర్టీసీ చార్జీల మోత షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను అధికారికంగా పెంచేశారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆర్టీసీ అధికారులు ప్రకటించిన చార్జీలను పరిశీలిస్తే మాత్రం ప్రయాణికులపై భారం వేశారు. ప్రయాణికుడు కండక్టర్ మధ్య చిల్లర (పైసల) గొడవలు లేకుండా ప్రతి టికెట్‌పై ఐదు రూపాయాలు పెంచేశారు. పట్టణ ప్రజలపై చార్జిల భారం అధికంగా బాదేశారు. గ్రామీణ ప్రజలపై ప్రభుత్వం మమకారం చూపింది. విద్యార్థి బస్ పాస్‌లు, జనరల్ పాస్‌లు, రూట్ పాసులు నెల, క్వాటర్లీ పాసుల చార్జీలు పెరిగాయి. రూట్ పాస్‌లు రూ. 265 నుంచి 330, హైస్కూల్, కాలేజీ విద్యార్థుల చార్జీలు రూ. 775 నుంచి 1025కు పెరిగాయి. జీబీటీ నెలవారి చార్జీలు రూ. 770 నుంచి 950, మెట్రో బస్సుకు రూ. 990 నుంచి 1185 వరకు, ఉద్యోగుల బస్ చార్జీలు నెలవారీ రూ. 260 నుంచి 320 అలాగే మెట్రోకు 480 నుంచి 575 పెంచారు. ఇలా అన్ని వర్గాలపై చార్జీల మోత మోపారు.
డీజిల్, విడిభాగాల ధరల పెరుగుదల వల్లే..
డీజిల్, విడిభాగాలు, టైర్లు వంటి ధరలు పెరగడంతో ప్రయాణికులపై చార్జిల భారం వేయక తప్పలేదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అన్ని రకాల బస్సు చార్జిలను పెంచడం అనివార్యం అయ్యిందన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పెంచిన కనీస చార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి. పల్లెవెలుగు 10.00, ఎక్స్‌ప్రెస్ 15.00, డీలెక్స్ 20.00, సూపర్ లగ్జరీ 25.00, రాజధాని/వజ్ర 35.00, గరుడ ప్లస్ 35.00, సిటీ ఆర్డినరీ 10.00, మెట్రో ఎక్స్‌ప్రెస్ 10.00,
మెట్రో డీలక్స్ 15.00 పెంచారు. రాష్ట్రంలో పట్టణ ప్రయాణికులపై భారం మోపుతూనే గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ప్రభుత్వం మమకారం చూపింది.