తెలంగాణ

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల నామినేటెడ్ పోస్టులకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లాభదాయక పోస్టుల నుంచి రాష్టస్థ్రాయి కార్పొరేషన్ పోస్టులకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు ది తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ (సవరణ) ఆర్డినెన్స్-2019ను సవరించింది. ఆర్డినెన్స్ జారీ కావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. లాభదాయక పదవుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను నియమించడానికి అనుగుణంగా ఆర్డినెన్స్ జారీకి ఇటీవల జరిగిన మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఖాళీగా ఉన్న 28 రాష్టస్థ్రాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను నియమించడానికి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. శాసనసభ తిరిగి సమావేశమైనప్పుడు ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలో ఆమోదం పొందనుంది. ఇలా ఉండగా, మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ పదవులు దక్కనున్నాయి.