తెలంగాణ

రాష్ట్రంలో ఇక నైపుణ్య విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: విద్యార్ధుల్లో ఇక నైపుణ్యాన్ని పెంపొందించే విద్యను అందించనున్నట్టు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా తదితరులతో వినోద్‌కుమార్ రాష్ట్రంలో రానున్న కాలంలో కరిక్యులమ్‌లో తీసుకోవల్సిన చర్యలతో పాటు నైపుణ్యాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి వారిలో అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా వినోద్‌కుమార్ చర్చించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఎన్నో అవకాశాలున్నాయని, ఈజీఎంఎం, ఎన్‌ఎస్‌డీసీలతో కలిసి ప్రణాళికాబద్దంగా కార్యాచరణ రూపొందించి వాటిని నిరుద్యోగ యువతకు అందించాలని అన్నారు. టెన్త్, ఇంటర్ స్థాయి విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టిని సారించాలని వినోద్‌కుమార్ సూచించారు. యూనివర్శిటీలకు- పరిశ్రమలకు మధ్య అనుసంథానానికి గత నాలుగుదశాబ్దాలుగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని వినోద్‌కుమార్ విమర్శించారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాల లోపాలను గుర్తించి వాటిని సరిచేయడానికి ప్రయత్నించలని చెప్పారు. జీవితాంతం ఉపాధి లేదా ఉద్యోగావకాశాలను పెంపొందించే శిక్షణను విద్యార్థులకు డిగ్రీ స్థాయిలోనే అందించాలని కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కారాదని అన్నారు. మధ్యప్రదేశ్, ఎంపీ, ఒడిస్సా , రాజస్థాన్ రాష్ట్రాలు నైపుణ్యాభివృద్ధి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నిస్తే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలుగుతామని అన్నారు. ఐటీఈఎస్ సంస్థతో పాటు విదేశాల సహకారాన్ని కూడా ఆయా రాష్ట్రాలు పొందుతున్నాయని చెప్పారు. అవసరమైతే ఒక బృందం సింగపూర్ వెళ్లి అధ్యయనం చేయాలని వినోద్‌కుమార్ సూచించారు.
ఓపెన్ వర్శిటీలో ఘనంగా
ప్రొ. రాంరెడ్డి జయంతి
దూరవిద్య పితామహుడు ప్రొఫెసర్ జి రాంరెడ్డి జయంతిని అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ డీ నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత పరిసిథతుల్లో ఉన్నతవిద్య విధానం ఆందోళనకరంగా ఉందని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను పటిష్టం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ సుధాకర్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జీ లక్ష్మారెడ్డి , ప్రొఫెసర్ జీ హరగోపాల్, ప్రమీలా రాంరెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.