తెలంగాణ

రైతుల సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జనవరి 4: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని, కరవును అధిగమించేందుకు గాను రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అఫెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంచే పది లక్షల రూపాయలతో నిర్మించిన నూతన వ్యాపార సముదాయం, నిత్యావసర వస్తువుల విక్రయ విభాగం (సూపర్ మార్కెట్)ను కొండూరు రవీందర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు.
అనంతరం సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో రవీందర్ రావు మాట్లాడుతూ రైతులకు అండగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలోని ఒకటి, రెండు సంఘాలు మినహా 127 సంఘాలు లాభాల బాటలో నడుస్తున్నాయన్నారు. రైతులకు సహకార సంఘాల ద్వారా ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందన్నారు. సింగిల్‌విండోల ద్వారా రైతులకు, చిరువ్యాపారులకు రుణాలు అందిస్తూ అండగా ఉంటున్నాయన్నారు. ఈ సంఘం నాదే అనే భావనతో సభ్యులందరు పనిచేస్తే సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరవు పరిస్థితుల దృష్ట్యా రైతులు ధైర్యంగా ఉంటూ ఆరుతడి పంటలను మాత్రమే పండించాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువగా పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమగ్ర వ్యవసాయం చేస్తేనే రైతులకు లాభాలు ఉంటాయన్నారు. సుల్తానాబాద్ సింగిల్‌విండో ద్వారా 12 కోట్ల రుణాలు అందజేయడంతో పాటు రైతులకు మరెన్నో సేవలు అందించి సహకార సంఘాన్ని జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా ఎన్నిక కావడం పట్ల చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్‌తో పాటు పాలకవర్గాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రస్తు తం గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు కృషి చేయాలన్నారు. చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ కొండూరు రవీందర్ రావు, దాసరి మనోహర్ రెడ్డిల సహాయం తీసుకొని సుల్తానాబాద్ సంఘాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.