రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 17: తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ఆదివారం ఇక్కడ నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావును ఆయన పరామర్శించి సతీమణి మృతి పట్ల సానుభూతి తెలిపారు. ఈసందర్భంగా విహెచ్ విలేఖర్లతో మాట్లాడుతూ చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరూ తోడు దొంగలని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజలు ప్రతిఘటిస్తారన్నారు. సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన టర్కీ ప్రజల స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పార్టీ మారుతున్న ఫిరాయింపుదారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కెసిఆర్ కూడా ఇదేతీరున ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆరోపించారు. గతంలో చేసిన తప్పులకే కాంగ్రెస్ పార్టీ శిక్ష అనుభవిస్తోందని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా తెలంగాణకు హక్కుపరంగా రావాల్సిన వాటాల గురించి కూడా ఉద్యమిస్తామని తెలిపారు.