తెలంగాణ

ఫిబ్రవరి 17 నుంచి బయో ఏషియా సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న బయో ఏషియా-2020 సదస్సు ప్రారంభం కాబోతోంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సుకు నూరు దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న బయో ఏషియా సదస్సులో భాగస్వామ్యం కావడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో మంగళవారం స్విట్జర్లాండ్ కాన్సులేట్ సిల్వన రెంగ్లీ ఫ్రె తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ లైఫ్ సైనె్సస్ రంగంలో రాష్ట్రం బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసుకున్నారు. ప్రపంచంలోనే ఈ రంగంలో తెలంగాణ హబ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. బయో ఏషియా 17వ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం వల్ల హాజరుకానున్న వంద దేశాలు ఈ రంగంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి దోహదం చేస్తుందన్నారు. బయో ఏషియా సదస్సులో భాగస్వామ్యం కావడానికి స్విట్జర్లాండ్ ముందుకు రావడంతో స్విస్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, లైఫ్ సైనె్సస్ రంగంలో స్విట్జర్లాండ్ ఎంతగానో రాణించిందన్నారు. బయో ఏషియా సదస్సులో స్విట్జర్లాండ్ భాగస్వామ్యం కావ డం వల్ల తెలంగాణ-స్విట్జర్లాండ్ రెండు కూడా ఈ రంగంలో అభివృద్ధి సాధించడానికి దోహదం
చేస్తుందన్నారు. ఇండియాలోనే లైఫ్ సెనె్సస్‌లో తెలంగాణ రాష్ట్రం నిలయంగా అభివృద్ధి చెందిన విషయాన్ని స్విట్జర్లాండ్ గుర్తించడం వల్లే తమతో భాగస్వామ్యం కావడానికి ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పటికే అనేక స్విస్ కంపెనీలు ఉన్నాయని, బయో ఏషియా సదస్సు తర్వాత మరిన్ని కంపెనీలు ఇక్కడికి రావడానికి, విస్తరించడానికి దోహదం చేస్తుందని అన్నారు.

*చిత్రం...మంత్రి కేటీఆర్‌ను మంగళవారం కలిసిన స్విట్జర్లాండ్ కాన్సులేట్ సిల్వన రెంగ్లీ ఫ్రె