తెలంగాణ

వినోదాత్మకం.. మెట్రో ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే నగరవాసులకు ఆధునిక ప్రమాణాలతో కూడిన మెట్రోరైలు మరింత మెరుగైన సేవలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నామమాత్రపు చార్జీలతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణికులను చేర్చుతున్న మెట్రోరైలులో ఇకపై సెల్‌ఫోన్‌లోని ఇంటర్నెట్, వైఫైతో ఎలాంటి సంబంధం లేకుండా వినోదాత్మకమైన వీడియోలు చూసుకునే వెసులుబాటు కల్పించింది. సుగర్ బాక్స్ నెట్‌వర్క్‌తో కలిసి మెట్రోరైలు ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని మంగళవారం బేగంపేటలోని ఓ హోటల్‌లో ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం విమానాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఇలాంటి వినోదాత్మక కార్యక్రమాలను మొట్టమొదటి సారిగా మెట్రోరైలు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో తెచ్చింది. మెట్రోరైలులో ప్రయాణించే వారు
తమ సెల్‌ఫోన్లలో ఉచితంగా సినిమాలు, మ్యూజిక్, గేమ్‌లతో పాటు ఇతర వినోదాత్మక కార్యక్రమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని మెట్రోరైలు అధికారులు తెలిపారు.
ఎలా కనెక్ట్ కావాలి
సుగర్ బాక్సును ఎలా కనెక్ట్ చేసుకోవాలన్న విషయాన్ని ప్రారంభోత్సవంలో అధికారులు వెల్లడించారు. మెట్రోరైలు ఎక్కగానే ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లోని వైఫై సెట్టింగ్‌లలో సుగర్ బాక్సును సెర్చ్ చేయాలి. ఆ తర్వాత జీ5ను ఓపెన్ చేసి, ఫ్రీ ప్లే నొక్కి, సెల్‌ఫోన్ నెంబరును రిజిష్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రీమ్ చేసి సినిమాలు, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించవచ్చు.
ఇదీ విప్లవాత్మకమైన ఆధునిక సౌకర్యం
*మెట్రో ఎండీ డా. ఎన్వీఎస్ రెడ్డి
మెట్రోరైలులో వైఫై, ఇంటర్నెట్‌తో ఎలాంటి సంబంధం లేకుండా ప్రత్యేక యాప్ ద్వారా వినోదాత్మక కార్యక్రమాలను డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించడం అనేది విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానమని మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ సౌకర్యం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ తొలి దశగా పది స్టేషన్ల వరకు అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యాన్ని త్వరలోనే అన్ని స్టేషన్లకు విస్తరించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ఇందులోని కార్యక్రమాలను మున్ముందు విద్యకు సంబంధించి సినిమాలు, వీడియోలు, ఈ లెర్నింగ్, షాపింగ్, ఫుడ్ డెలివరీ, లాస్ట్‌మైల్ క్యాబ్ బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సేవలను విస్తరించేందుకు సుగర్ బాక్సు సీఈఓ కూడా అంగీకరించినట్లు తెలిపారు. ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ డా.కేవీబీ రెడ్డి, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సైనీ మాట్లాడుతూ మహానగరవాసులు మెట్రో ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా, వినోదాత్మకంగా చేసేందుకు వీలుగా మున్ముందు మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ వినోదాత్మకమైన కార్యక్రమాలు అమీర్‌పేట, జేఎన్‌టీయూ, బేగంపేట, నాగోల్, ఉప్పల్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, సికిందరాబాద్ (ఈస్ట్) స్టేషన్లలో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.
*చిత్రం...మెట్రోరైళ్లలో వీడియోలను తిలకించేందుకు వీలుగా రూపొందించిన యాప్‌ను ప్రారంభిస్తున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు