తెలంగాణ

తీవ్ర ఆవేదనలో ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, డిసెంబర్ 10: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరే కాలు వ్యక్తమవుతుండగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయ. నిందితుల కుటుంబాలకు సానుభూతిగా ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ అత్యాచార సంఘటతో తను తీవ్ర కలత చెందానని, ఎన్‌కౌంటర్ అయిన నలుగురి యువకుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి వారితో గడిపి వారి కష్టసుఖాలలో పాలు పంచుకొని సరైన మార్గంలో నడిచేందుకు కృషి చేయాలని ఆమె తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ వనరులను పొదుపుగా వాడుకుంటే రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని ఆమె అన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ అందిస్తున్నారని తెలిపారు. రైతులకు అందించే సాగునీరు, పంటకు ఉచిత విద్యుత్, ఇంటింటికీ మిషన్ భగీరథతో తాగునీరు అందిస్తున్నారని రైతులు అవసరం ఉన్నప్పుడే విద్యుత్‌ను వినియోగించుకోవాలని ప్రజలు మిషన్ భగీరథ తాగునీరు వృథా చేయకుండా కాపాడుకోవాలన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వనరులను పొదుపు చేసుకున్నప్పుడే తెలంగాణకు భారం తగ్గుతుందన్నారు. పేదింటి ఆడపిల్లలకు ఇంటి పెద్ద దిక్కులా కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా వివాహానికి లక్ష 116రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టీ.అమరావతి, జడ్పీటీసీ కే.లక్ష్మి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఎండీ.ఖలీల్, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ కుంచాల సుశీల, సర్పంచ్ వరలక్ష్మి, పందుల రేఖ, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ, గార్లపాటి సోమిరెడ్డి, గడ్డమీది పాండరి, తహశీల్దార్ బ్రహ్మయ్య వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత