తెలంగాణ

ఆత్మరక్షణ శిక్షణతో అపర కాళికలుగా మారండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని: ‘ఆడ పిల్లలు మనో ధైర్యాన్ని కోల్పోవద్దు... విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి... ఆత్మరక్షణకు ఉపయోగపడే యుద్ధ కళ శిక్షణతో ఆడ పిల్లలు అపర కాళికలుగా మారండి’ అని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని స్పందన క్లబ్ ఆవరణలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే బాలికలకు కళరిపయట్టు శిక్షణను ఆమె ప్రారంభించారు. బాలికల చేపట్టిన కళరిపయట్టు యుద్ధ కళా ప్రదర్శనను గవర్నర్ దంపతులు తిలకించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... ఆత్మ రక్షణకు యుద్ధ కళలో ప్రావీణ్యం ఉండటం మన జీవితానికి చాలా ఉపయోగపడుతుందని, అలాగే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇలాంటి కళల్లో తర్ఫీదు అవసరమని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో 15 వేల మంది బాలికలకు స్వదేశీ ఆత్మరక్షణ శిక్షణైన కళరిపయట్టులో శిక్షణ అందిస్తున్న కలెక్టర్ శ్రీదేవసేనను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. బాలికలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్తి స్థాయిలో కళరిపయట్టు అభ్యసించాలని చెప్పారు. నేర్చుకున్న యుద్ధ కళను ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించాలని... అలాగే తోటి ఆడ పిల్లలకు కూడా దీనిని నేర్పించాలని గవర్నర్ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి బాలికకు ఆత్మరక్షణకు సంబంధించిన శిక్షణ అందించాలని, పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికి ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ అన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం నుంచే కరికులంలో ఆత్మరక్షణ కళలు భాగస్వామ్యం కావాలని తెలిపారు. స్వదేశీ యుద్ధ కళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని... ఈ యుద్ధ కళలకు ప్రాచుర్యం కల్పించే దిశగా కృషి చేయాలని అన్నారు. దేశంలోని అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగా శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించేలా కృషి చేశారని అన్నారు. విద్యార్థులు ప్రస్తుతం జంక్ ఫుడ్‌లకు అలవాటు పడుతున్నారని, ఇది పూర్తిగా మానుకొని పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే శారీర దృఢత్వం పెరుగుతుందని, మనమెంతో బలశాలిగా మారుతామని చెప్పారు. కేరళ రాష్ట్రం నుంచి 30 మంది శిక్షణకులను ఏర్పాటు చేసి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న కలెక్టర్‌ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. కళరిపయట్టు మాస్టర్ ట్రైయినర్ శివను గవర్నర్ శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థులకు గవర్నర్ నిఘంటువులను అందించారు. బసంతనగర్ వద్ద జిల్లా అటవీ అధికారి ఆధ్వర్యంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించిన గవర్నర్ మొక్కలు నాటారు. బసంతనగర్‌లో ఏర్పాటు చేసిన బట్ట సంచుల తయారీ కేంద్రాన్ని గవర్నర్ పరిశీలించారు. శాంతినగర్‌లో స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన సబల శానిటరీ న్యాప్కిన్ తయారీ కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు.
స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలించేందుకు పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామంలో పర్యటించి అక్కడ స్వచ్ఛతపై అభినందించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, గవర్నర్ సెక్రటరీ చంద్రమోహన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ సత్యనారాయణ, రామగుండం ఎన్టీపీసీ ఈడీ పిపి కులకర్ణి, జిల్లా జేసీ వనజాదేవి, జిల్లా ఇన్‌ఛార్జి డిఆర్‌ఓ నర్సింహ మూర్తి, ఆర్డీఓలు ఉపేందర్ రెడ్డి, నగేష్, ఉన్నతాధికారులు పాల్గొనగా గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
*చిత్రాలు.. సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
* కళరిపయట్టు ప్రదర్శిన్న విద్యార్థినులు