తెలంగాణ

దేశ భద్రత తక్షణ కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: దేశ భద్రతే తక్షణ కర్తవ్యమని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ చీఫ్ దేవేందర్‌జీ పేర్కొన్నారు. దేశద్రోహులకు , అక్రమ చొరబాటుదారులకు, నరహంతకులకు మద్దతు తెలిపేవారు, విదేశీ నిధులతో బతికేవారు ఈ దేశ సెక్యులరిజం గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. వారంతా దేశ ద్రోహులేనని పేర్కొన్నారు. దేశభద్రతకు నేడు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుపడుతూ శత్రుదేశాలకు మద్దతు ఇచ్చేవాంతా ఆ దేశం విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడ్డవారేనని అన్నారు. బజరంగ్‌దళ్ రాష్టస్థ్రాయి శిబిరం రాయదుర్గంలోని ఒయాసిస్ పాఠశాలలో శనివారం నాడు ప్రారంభం అయ్యింది. రెండు రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి రాష్టవ్య్రాప్తంగా ఎంపిక చేసిన 650 మంది బజరంగ్‌దళ్ కార్యకర్తలు హాజరవుతున్నారు. భరతమాత పూజ నిర్వహించిన అనంతరం దేవేందర్‌జీ మాట్లాడారు. హిందువుల ఐక్యతతోనే భారతదేశానికి భద్రత లభిస్తుందని అన్నారు. హిందువుల్లో ఐక్యత తగ్గి, దైవభక్తి సన్నగిల్లితే పరాయి మతస్తుల ఉచ్చులో పడి మతం మారిన వారెందరో ఉన్నారని, వారి వల్ల దేశానికి అనేక రకాలుగా ముప్పు పొంచి ఉందని అన్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లింలతో పాటు నరరూప రాక్షసులైన వారెందరో ఇక్కడ ఉన్నారని వారందరినీ ఈ దేశం నుండి తరిమివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమని అన్నారు. బెంగాల్, త్రిపుర, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలన్నీ చొరబాటుదారుకు అడ్డాగా మారాయని పేర్కొన్నారు. అక్రమ చొరబాటుదార్లను వెళ్లిపొమ్మన్నందుకే ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయని అన్నారు. ప్రతి బజరంగ్‌దళ్ కార్యకర్త ఆయా గ్రామాలకు హిందూ రక్షకులుగా ఉండాలని అన్నారు. మాయమాటలు చెప్పి కొందరు గ్రామం పేరుతో మరికొందరు మోసం చేసి హిందూ అమ్మాయిలను అపహరిస్తూ మత మార్పిడులు కొనసాగిస్తున్నారని ఆందోళన చెందారు. గ్రామాల్లో దైవ చింతన పెంచి, తద్వారా దేశభక్తి పెంపొందించాలని అన్నారు. ధర్మ రక్షణకు నిస్వార్ధంగా పనిచేనయాలని అన్నారు. బజరంగ్‌దళ్ రాష్ట్ర సంయోజక్ సుభాష్ చందర్ అద్యక్షత వహించారు.
రాష్ట్ర కన్వీనర్లు శివరాం, కుమార స్వామి, వీహెచ్‌పీ నేతలు. రాజగోపాలనాయుడు, పగుడాకుల బాలస్వామి, నాగేశ్వరరావు, పాండురంగారెడ్డి, బ్రహ్మం నాగరాజు, అల్లంకి రాము, లక్ష్మణ్ యాదవ్, గిరిధర్ వినోద్, చైతన్య, ప్రదీప్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో 1990, 1992లో కరసేవకు వెళ్లిన వారిని సన్మానం చేయనున్నారు.