తెలంగాణ

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: పౌరసత్వ చట్ట సవరణపై వామపక్షనేతలు భగ్గుమన్నారు. రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలుచేయవద్దని సీపీఎం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయగా, చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ఉద్యమం జరగాలని సీపీఎం జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. చట్ట సవరణపై ఎఐఎస్‌ఎఫ్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అమలు చేయవద్దు: తమ్మినేని
కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం మతకోణంలో తన మెజార్టీని దుర్వినియోగం చేస్తూ దేశ ప్రజాస్వామిక, లౌకిక విలువలను మంట కలుపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. పౌరసత్వానికి, మతానికీ ముడిపెడుతూ లౌకికతత్వానికి పూర్తిగా వ్యతిరేకించేలా ఉన్న దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. దేశ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు ప్రకటించాయని, తెలంగాణలో కూడా దానిని అమలుచేయరాదని వీరభద్రం పేర్కొన్నారు. మతకోణంలో తెస్తున్న ఈ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని టీఆర్‌ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో చెప్పారని కనుక ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే ఒక ప్రకటన చేయాలని అన్నారు.
దేశవ్యాప్త ఉద్యమం: సురవరం
భారత లౌకిక ప్రజాతంత్ర మూలాలను ధ్వంసం చేసే పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమం జరగాలని సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మఖ్దూం భవన్‌లో మండా పవన్ అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సురవరం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పొరుగుదేశాల్లో వివక్ష ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఉద్ధేశించిన ఈ వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినా, వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు తీవ్రంగా వ్యతిరేకించాయని పేర్కొన్నారు. వ్యక్తుల మత గుర్తింపును పౌరసత్వానికి ముడిపెట్టడం విచారకరమని అన్నారు. లౌకికవాదానికి ఈ బిల్లు పూర్తిగా విరుద్దమని అన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్‌ను ఉరితీసిన రోజైన డిసెంబర్ 19న క్యాబ్‌కు నిరసనదినంగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాడవెంకటరెడ్డి, కూనమనేని సాంబశివరావు తదితరులు మాట్లాడారు.
ఏఐవైఎఫ్ నిరసన
రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి కడుతూ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించిందని పేర్కొంటూ ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామిక దేశంలో లౌకికరాజ్యం అమలులో ఉన్నచోట పౌరసత్వాన్ని మతం ఆధారంగా నిర్దేశించడం పెద్ద విషాదమని అన్నారు. ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌స్టాలిన్, హైదరాబాద్ కార్యదర్శి ఎస్ శ్రీకాంత్, ఆర్ బాలకృష్ణ, ఎన్ శ్రీకాంత్, మాజిద్, దశరధ్, వంశీ, హరికృష్ణ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
*చిత్రం... హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న ఏఐవైఎఫ్ కార్యకర్తలు