తెలంగాణ

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటాను ఆన్‌లైన్‌లోనే భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా గడువు దగ్గరపడగానే తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో వ్యవహారం కాస్తా ముదురుపాకాన పడింది. ముఖ్యంగా యాజమాన్య కోటాకు మంచి గిరాకీ ఏర్పడింది. కన్వీనర్ కోటా భర్తీ చేయకముందే ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా భర్తీ అయినట్టు చెబుతున్నా ఉన్నత విద్యా మండలి అధికారులు, సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దాంతో ప్రముఖ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు బహిరంగ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. కాలేజీలు అన్నీ సిటీ కేంద్రాలను ఏర్పాటు చేసి, పిఆర్‌ఓల ద్వారా అమ్మకానికి పెట్టాయి. నేరుగా అభ్యర్థులకు ఫోన్లు చేసి కార్పొరేట్ కాలేజీలు సీట్ల ధరలను చెప్పడం గమనార్హం. మంచి ర్యాంకు సాధించలేకపోయిన విద్యార్థులు, తొలి దశలో మంచి కాలేజీల్లో సీట్లు సాధించని వారు సైతం యాజమాన్య కోటాపై దృష్టిసారించడంతో ఎలాంటి మెరిట్‌ను పట్టించుకోకుండానే భర్తీ చేస్తున్నారు.
యాజమాన్య కోటాను జెఇఇ ర్యాంకు , తర్వాత ఎమ్సెట్ ర్యాంకు, దాని తర్వాత ఇంటర్ మార్కులు ప్రాతిపదికగా మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎఐసిటిఇ, రాష్ట్రప్రభుత్వం కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ మార్గదర్శకాలను పాటించకపోయినా, సీట్ల భర్తీ అనంతరం లిస్టులను ఉన్నత విద్యా మండలి అధికారులు ర్యాటిఫికేషన్ చేస్తున్నారు.
ర్యాటిఫికేషన్ కోసం లక్షలాది రూపాయలను యాజమాన్యాలు ఖర్చు చేసి అడ్డగోలు జాబితాలకు రాత్రికి రాత్రి అనుమతి సంపాదించుకుంటున్నాయి. యాజమాన్యాలు భర్తీ చేసే 30 శాతం సీట్లలో 15 శాతం యాజమాన్యం కోటా, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ కోటా అంటే ఏమిటో కూడా చాలా స్పష్టమైన నిర్వచనాన్ని ప్రభుత్వం ఇచ్చింది. రాత్రికి రాత్రి ఊరుకూడా దాటని వారిని ఎన్‌ఆర్‌ఐ కోటా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా కింద చూపించి కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేసి అడ్మిషన్లు ఇస్తున్నాయి. రికార్డులు లెక్కలకు సమర్పించినపుడు మాత్రం యాజమాన్యాలు ఈ వివరాలను ఇవ్వడం లేదని తెలిసింది. కొన్ని కాలేజీలు చెక్కులను కూడా తీసుకోవడం లేదు, చెక్కులు తీసుకుంటే లెక్కలు బయటకు వస్తాయని భావిస్తున్న యాజమాన్యాలు నేరుగా నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.