తెలంగాణ

రైతులను విస్మరించడం గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూలై 18: సిఎం కెసిఆర్ రైతాంగాన్ని విస్మరించడం గర్హనీయమని, ఈ చర్య పౌర హక్కుల ఉల్లంఘనే అని సిఎల్‌పి ఉపనేత, కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శాసన మండలి సభ్యుడు సంతోష్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వర్షాకాల సీజన్‌లో రైతులకు రుణ ప్రణాళికపై సిఎం స్వయంగా బ్యాంకర్లతో రుణప్రణాళిక, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుందని, కానీ రైతుల పెట్టుబడులకు సంబంధించిన సమావేశాన్ని వ్యవసాయ మంత్రితో నిర్వహించారని విమర్శించారు. రైతుల సమస్యలపై కెసిఆర్ చర్చించేందుకు సిఎం ఒక్కరోజును కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. సకాలంలో రుణాలు అందించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫసల్ బీమా ఫథకాన్ని కూడా రైతులు వినియోగించుకోలేని దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నారన్నారు. కరవు మండలాల రైతులను అదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అదుకునేందుకు కేంద్రం విడుదల చేసిన 8 వందల కోట్లను కూడా పంపిణీ చేయకపోవడంపై రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు నిదర్శనమని ఆయన విమర్శించారు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ, కనీస వాయిదాల పద్ధతిలో అమలు చేయతలపెట్టిన 25 శాతం రుణమాఫీ మొత్తాన్ని వెంటనే సంబంధిత బ్యాంకర్లకు జమ చేయడంతో పాటు, బ్యాంకర్ల సమావేశం స్వయంగా నిర్వహించి 31 జూలై లోపు పూర్తి స్థాయి రెతులకు రుణ అర్హతకు అనుగుణంగా అప్పులు అందించాలని జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో కరవు మండలాల గుర్తింపు ప్రాంతాల్లో కేంద్రం నుండి విడుదల చేసిన పెట్టుబడులు పంపిణీ చేపట్టాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేసారు. ఈమేరకు సిఎం కెసిఆర్‌కు రుణమాఫీ, రుణ ప్రణాళిక, ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వానికి బహిరంగా లేఖను అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమవేశంలో విండో చైర్మన్ అయిలవేని గంగాధర్, ఎంపిపి గర్వందుల మానస, జడ్పీటిసి బూక్య సరళ, మాజీ ఎఎంసి చైర్మన్ దామోదర్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.