తెలంగాణ

మల్లన్నసాగర్‌ను నిర్మించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్నూర, జూలై 18: మెదక్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. హత్నూర గురుకుల పాఠశాలలో విద్యార్థుల వసతి గృహం, కొన్యాల గ్రామ సబ్‌స్టేషన్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాకతీయ, రెడ్డిరాజుల కాలంలో నిర్మించిన గొలుసు కట్టు చెరువుల్లో పూడిక పేరుకుపోయి నీరు నిల్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఫలితంగా సేధ్యానికి నీరులేక పంటలు ఎండుముఖం పట్టి రైతులు అల్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అవసరమైన చోట్లలో ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా జీర్ణించుకోలేని కాంగ్రెస్, టిడిపిలు ప్రజలను రెచ్చగొడుతూ అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్ష నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దత్తచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మండల పరిధిలోని మదుర గ్రామ శివారులోని దత్తచల క్షేత్రంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి మురళీయాదవ్, జెడ్పీటిసి జయశ్రీ, ఎంపిపి మల్లమ్మ, సర్పంచ్‌లు జయశ్రీ, సుజాత, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు