తెలంగాణ

20వేల కోట్ల ప్యాకేజీ ఇప్పిస్తే మీ పార్టీకే ఓటేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: బిజెపి నాయకులకు దమ్ముంటే ప్రధానమంత్రితో మాట్లాడి హైదరాబాద్ అభివృద్ధికి 20వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇప్పించాలని, అలా చేస్తే తాను బిజెపికి ఓటువేస్తానని టిఆర్‌ఎస్ ఎంపి కవిత సవాల్ చేశారు. సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో విపక్షాలు అనవసర విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేట్టు చేయాలని అన్నారు. ప్రధానమంత్రి తెలంగాణలో ఇప్పటివరకు పర్యటించలేదని, పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా తెలంగాణకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని అన్నారు. కేంద్రం నుంచి ప్యాకేజీ ప్రకటించేట్టు చేయని నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న టిఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని కవిత కోరారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించి, విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు మద్దతు ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్‌కు ఇండ్లు ఇచ్చామని బిజెపి నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, కేంద్రం మెడలు వంచి మంజూరు చేయించుకున్నామని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకే కేటాయించినట్టు తెలిపారు. 150 వార్డులు ఉంటే వీటిలో 75 వార్డులు మహిళలకే రిజర్వ్ చేసినట్టు చెప్పారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నిజాం పాలకులు ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ ఉందని, విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని కవిత తెలిపారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికలు

పక్షంరోజుల్లో పూర్తి

నామినేషన్లకు మూడురోజులే పరిశీలన, తిరస్కృతికి రెండురోజులు
7రోజుల ప్రచారం గడువు ఒకరోజు పోలింగ్ చట్టసవరణ చేస్తూ సర్కారు ఉత్తర్వులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: జిహెచ్‌ఎంసి పాలక మండలి ఎన్నికలను హైకోర్టు విధించిన గడువులోపే పూర్తి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ వ్యవహరాల శాఖ ఎన్నికల ప్రక్రియ తతంగాన్ని కుదించింది. సాధారణంగా ఎన్నికలంటే నామినేషన్లు దాఖలు చేసిన నాటినుంచి పోలింగ్‌కు 45 రోజుల వ్యవధి ఉంటుంది. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల వ్యవధిలోనే జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు 1955 మున్సిపల్ చట్టంలో పలు సవరణలు చేసి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ అయిన తేదీనుంచి మూడురోజులపాటు నామినేషన్ల స్వీకరణ, తర్వాత ఒకరోజు పరిశీలన, మరుసటి రోజు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చేలా చట్టంలో సవరణలు చేసింది. తర్వాత ఏడు రోజులపాటు ప్రచారానికి అవకాశమిచ్చేలా చట్ట సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచారానికిచ్చిన గడువు ముగిసిన తర్వాత, ఒకటి రెండురోజుల సమయమిచ్చి పోలింగ్‌ను ముగించాలని సర్కారు భావిస్తోంది. మేయర్‌ను ఎన్నికునే ప్రక్రియను సైతం ఈ పదిహేనురోజుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈక్రమంలో ఇప్పటికే ఈ మాసంలో నాలుగురోజులు గడిచిపోయింది, ఇక మిగిలింది మరో 26రోజులు. ఇందులో 15రోజుల్లో అంటే 5న నోటిఫికేషన్ జారీ చేస్తే 20లోపు, ఏడున జారీ చేస్తే 22లోపు ఎన్నికల ప్రక్రియ ముగిస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్-వరంగల్
రహదారిపై ఫ్లైఓవర్
77 కోట్లు మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: కరీంనగర్ కమాన్ నుంచి మానకొండూరు వరకు దాదాపు 4 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 77 కోట్లు మంజూరు చేసింది. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా 600 మీటర్ల పొడవున బ్రిడ్జి కూడా నిర్మిస్తారు. ఈ రహదారి నిర్మాణం వల్ల కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో 7 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. ఈ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిని సోమవారం క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.