తెలంగాణ

అక్కడ రోజుకు 50వేల మందికి వంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ఒకేసారి ఇంటికి పది మంది వస్తే వండి వడ్డించడం ఇల్లాలికి కష్టం. మరి 50వేల మందికి ఒకేసారి వండితే ఎలా ఉంటుంది. నిజం ఇప్పుడు ఒకేసారి 50వేల మందికి వంట వండే అత్యాధునిక వంటశాల నేటి నుంచి తెలంగాణలో ప్రారంభం అయింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ - హైదరాబాద్ నిర్వహిస్తున్న భోజన వితరణ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా ఒకేచోట 50వేల మందికి వంట వండే అత్యాధునిక కేంద్రీకృత వంటశాలను ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సోమవారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఏపటు చేసిన ఈ అత్యాధునిక వంటశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సమావేశంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యయులు సత్యగౌర చంద్ర దాస స్వామీజీ మాట్లాడుతూ హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలోని 12 మండలాల్లో సవనారు లక్ష మంది పిల్లలకు మధ్యాహ్నా భోజనం అందిస్తున్నట్టు చెప్పారు. భోజనామృత కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగువేల మంది రోగి సహాయకులకు ఉచిత మధ్యాహ్నా భోజనం అందిస్తున్నట్టు చెప్పారు. ఇదే విధంగా జిహెచ్‌ఎంసి సహకారంతో ఐదు రూపాయలకే భోజన పథకం ద్వారా సుమారు 15వేల మంది నగరంలోని పేదలకు పౌష్టిక భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. సద్దిమూట కార్యక్రమం ద్వారా తెలంగాణలోని ముఖ్యమైన నాలుగు మార్కెట్ యార్డుల్లో ప్రతి రోజూ రైతులు, హమాలీలకు మధ్యాహ్నా భోజనం అందిస్తున్నట్టు చెప్పారు.
ఈ సేవా కార్యక్రమాలకు అత్యాధునిక పరికరాలతో, శుచి, శుభ్రత, పౌష్టిక విలువలు కలిగి ఉండే విధంగా భోజనాలు వండేందుకు కేంద్రీకృత వంటశాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అరబిందో ఫార్మా, శ్రీకృష్ణ గోసేవ మండల్ యాజమాన్యం సహకరించడంతో ఆధునిక వంటశాల నిర్మించినట్టు చెప్పారు. ఈ అత్యాధునిక వంటశాలో సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం పదిహేను నిమిషాల్లో వెయ్యి మందికి అన్నం వండగలదు. రెండు గంటల్లో ఐదువేల మందికి నోరూరించే సాంబారును చేయడమే కాకుండా వంటశాల వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. భోజనామృత వంటశాల ద్వారా 50వేల మందికి భొజనాలు వండుతామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు హరేకృష్ణ మూవ్‌మెంట్ సేవను మంత్రి కెటిఆర్ కొనియాడారు. ఈ భోజన కార్యక్రమం ద్వారా మంచి పేరు వస్తుందని అన్నారు. కెటిఆర్‌తో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. మంత్రులకు అక్కడే భోజనం వడ్డించారు. అంతా సహపంక్తి భోజనం చేశారు.

ముగ్గురు రైతుల ఆత్మహత్య
సుల్తానాబాద్/రాయకల్/శాయంపేట, జనవరి 4: అప్పుల బాధలు భరించలేక కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన కంకణాల కొమురయ్య (48) పంట సక్రమంగా రాకపోవడం, అప్పుల బాధ భరించలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే జిల్లాలోని రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన రాగుల మల్లారెడ్డి (50) రైతు సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కుమార్తె పెళ్లి, వ్యవసాయ పనులకోసం రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. ఇటీవల కొంత భూమి అమ్మి కొంత అప్పు తీర్చినా మిగతా అప్పులు తీర్చే అవకాశాలు కనబడడం లేదని మనస్తాపానికి గురైన మల్లారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా వరంగల్ జిల్లా శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో ఆదివారం సాయంత్రం మురహరి కుమారస్వామి (27) అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

గోదావరిపై నిర్మించే
ప్రాజెక్టులకు సహకరిస్తాం
ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి గడ్కరీ హామీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: మహారాష్ట్ర సరిహద్దులో గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నిత్ గడ్కరీ హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన నితిన్ గడ్కరీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించేబోయే ప్రాజెక్టులు, జల రవాణా మార్గాలపై ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

కరీంనగర్-వరంగల్
రహదారిపై ఫ్లైఓవర్
77 కోట్లు మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: కరీంనగర్ కమాన్ నుంచి మానకొండూరు వరకు దాదాపు 4 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 77 కోట్లు మంజూరు చేసింది. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా 600 మీటర్ల పొడవున బ్రిడ్జి కూడా నిర్మిస్తారు. ఈ రహదారి నిర్మాణం వల్ల కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో 7 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. ఈ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిని సోమవారం క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

జింక కేసు అటవీశాఖకు అప్పగింత
హైదరాబాద్ , జనవరి 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని జింకను చంపిన కేసును గచ్చిబౌలి పోలీసులు అటవీశాఖకు అప్పగించారు. ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణ ఇచ్చే కోచ్ గోవిందరావు, సెక్యూరిటీ గార్డు రాజయ్యను అరెస్టుచేసిన పోలీసులు అటవీశాఖకు అప్పగించారు. అటవీ శాఖ హైదరాబాద్ రేంజ్ సెక్షన్ ఆఫీసర్ వంశీకృష్ణ నిందితులను అప్పగించారు. వారిపై వన్యప్రాణి 1972 సెక్షన్ 9, 39, 51 కేసులు నమోదుచేసినట్లు వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం ఫైరింగ్ రేంజ్‌లో స్వాధీనం చేసుకున్న జింక మాంసాన్ని, చర్మం, తల, కాళ్లను పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. సంఘటన ప్రదేశాన్ని సందర్శించిన మాదాపూర్ డిసిపి కార్తికేయ మాట్లాడుతూ చాలాకాలం నుండి వన్యప్రాణుల వేట జరుగుతోందని తమకు ఫిర్యాదులొచ్చాయని, నిఘా పెట్టామని డిసిపి తెలిపారు.

పోటీ పరీక్షలకు రిఫరెన్స్
తెలంగాణ ఉద్యమాల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కెసిఆర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రంథ రచన మంచి ప్రయత్నమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆచార్య జయశంకర్ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత, సామాజిక రాజకీయ విశే్లషకుడు వి.ప్రకాష్ రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర- రాష్ట్ర ఆవిర్భావం పుస్తకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్ సతీమణి స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రంథ రచన ఒక గొప్ప ప్రయత్నమని, ఇంత సమగ్రంగా తెలంగాణ చరిత్రను ఇంతవరకు ఎవరూ గ్రంథస్థం చేయలేదని, ఉద్యమ కాలంలో జరిగిన అనేక సంఘటలను రచయిత ప్రకాష్ ప్రత్యక్షంగా చూశారని, అధ్యయనం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు.
వర్తమాన, భవిష్యత్ తరాల వారికి ఈ పుస్తకం చదవితే తెలంగాణ చరిత్ర పరిపూర్ణంగా అవగాహనకు వస్తుందని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే అనేక పోటీ పరీక్షలకు రిఫరెన్స్ మెటీరియల్‌గా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణకు చెందిన అనేక విషయాలను యధార్థంగా యథాతథంగా గ్రంథస్థం చేసిన ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రకాష్ దంపతులను ముఖ్యమంత్రి శాలువా కప్పి అభినందించారు. రచయిత ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులకు అంకితం ఇచ్చి వారిద్దరిని సన్మానించారు.