తెలంగాణ

వినకపోతే వేటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పట్ల ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారిని బుజ్జగించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించని వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని తన మాటగా హామీ ఇవ్వండని కూడా అధినేత కేసీఆర్ సూచించారు. నచ్చజెప్పినా వినకుండా తిరుగుబాటు అభ్యర్థిగా ఎవరైనా బరిలోకి దిగే అవకాశం ఉంటే వారి పేర్లను పార్టీ అధిష్ఠానానికి పంపించాలని ఆదేశించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా వెనుకాడేది లేదని అధినేత కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలతో అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు జారీ చేసే ఏ-్ఫరం, బీ-్ఫరాలపై అవగాహన కల్పించి వాటిని అందించడంతో పాటు నమూనా ఫారాలను కూడా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు అధినేత కేసీఆర్ అందజేశారు. అన్ని ఎన్నికల్లోనూ పార్టీ ఏకపక్షంగా గెలుపొందడంతో ఈ ఎన్నికల్లో పోటీకి చాలామంది టికెట్ ఆశిస్తారని చెప్పారు. టిక్కెట్ల కోసం ఎంతమంది పోటీ పడినా అభ్యర్థిగా ఎంపికయ్యేది ఒక్కరే కాబట్టి మిగతా వారికి నచ్చజెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ అశించిన ఆశావాహులకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్టస్థ్రాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. నామినేటెడ్ పదవులు ఎవరెవ్వరికీ ఇవ్వాలో కూడా ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి జాబితా పంపించాలని అధినేత కేసీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ఏకపక్షంగా
ఉంటుందని, మిగిలిన పార్టీలు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారన్నారు. ఇప్పటివరకు జరిపించిన అన్ని సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌కు ఎదురుండదని ఫీడ్ బ్యాక్ వచ్చినట్టు చెప్పారు.
అలస్యంగా వచ్చిన వారిపై ఆగ్రహం!
మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నిర్వహించే సమావేశానికి హాజరుకావడానికి ముందు రోజు రాత్రికే హైదరాబాద్‌కు చేరుకోవాలని ఆదేశించినప్పటికీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడం పట్ల అధినేత, సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ ఆదేశాలంటే లెక్క లేదా? అని సూటిగా ప్రశ్నించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. తాము ఆలస్యంగా సమావేశానికి రావడానికి గల కారణాలను వారు అధినేత కేసీఆర్‌కు వివరించారు. మంత్రుల మాదిరిగా ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొనాల్సి ఉందని అధినేత కేసీఆర్ అనుమతి తీసుకొని మంత్రి కేటీఆర్ సమావేశం ముగియగానే వెళ్లిపోయారు.

'చిత్రం... తెలంగాణ భవన్‌లో గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్