తెలంగాణ

కాంగ్రెస్‌లో కదనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈనెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలాపడిన కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని తహతహలాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పలుసార్లు పార్టీ సీనియర్లతో సమావేశమై ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను ఖరారు చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫారంలను ఇవ్వనున్నారు. స్క్రూటినీ తర్వాత కూడా బీ ఫారంలను ఇస్తామని, దీనిపై ఎటువంటి ఆందోళనకు గురికావద్దని కూడా
టీపీసీసీ కాంగ్రెస్ శ్రేణులను కోరింది. ప్రతి మున్సిపాలిటీలో నియోజకవర్గంలో గతంలో పోటీచేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, డీసీసీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు కలిసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసేవారు రూ.20ల బాండ్ పేపర్‌పై అఫిడవిట్‌ను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిజంది. స్థానిక అంశాలవారీగా మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు కలిపి మ్యానిఫెస్టోను ఖరారు చేయాలని నిర్ణయించారు. కాని దీనివల్ల చిక్కులు ఉన్నాయని భావించారు. చివరకు తర్జన భర్జన పడి మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టోలను విడుదల చేయాలని నిర్ణయించారు. చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్దేశించిన కమిటీ నేతలు పూర్తి చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇంకా అనేకమంది సీనియర్ నేతలను రంగంలోకి దింపనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణపై ఈ సారి ఫోకస్ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలిచి టీఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వాలని పార్టీ పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో సీట్లు దక్కని, పాపులారిటీ ఉన్న నేతలను ఆకర్షించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాడుకోవాలని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని టీపీసీసీ వ్యూహం ఖరారు చేసింది. వచ్చే పది రోజుల పాటు పార్టీ సీనియర్లు జనంలోనే ఉండాలని, నిర్దేశించిన మున్సిపాలిటీల్లో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని పార్టీ హైకమాండ్ పార్టీ రాష్ట్ర నేతలను కోరింది.