తెలంగాణ

ఎంఐఎంకు ఓటేస్తే.. టీఆర్‌ఎస్‌కు వేసినట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని, ఈ విషయంలో మైనారిటీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోరారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, లౌకికవాదానికి ప్రతీక అయిన కాంగ్రెస్‌ను బలపరచాలని ఆయన కోరారు. ఎంఐఎం మతతత్వ పార్టీ అని ఈ విషయంలో తొందరపాటుకు గురికారాదని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీని ఓడించాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. పార్కులు, మైదానాలు, సైకిల్ ట్రాక్‌లు, లైబ్రరీలను నిర్మిస్తామని ఉత్తుత్తి హామీలను ఇస్తున్నారని ఆయన టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగు వేల చెరువులను బాగు చేస్తామన్నారని, రెండు వేల చెరువులను కబ్జా చేశారన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఏమైందన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా, కరీంనగర్‌ను లండన్‌గా తీర్చిదిద్దుతామన్నారని, ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం మంచి పదవులు దక్కాయన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు మాట్లాడుతూ పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తేవడంతో అన్ని రాష్ట్రాల్లో సంక్షోభం తలెత్తిందన్నారు. కేంద్ర చట్టాలను అమలు చేయడంలో రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఢిల్లీ జేఎన్‌ఎన్‌లో ఆశిష్ ఘోష్‌పై ఆరెస్సెస్ గుండాలు దాడి చేస్తే, కేసులు పెట్టారన్నారు. సీఏఏకు
వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం అంటున్నారన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో సమానంగా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలన్నారు. బీజేపీ ఎంపీ సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, మత ఘర్షణలకు దారితీసే విధంగా మాట్లాడరాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోరాదన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, ముఖ్యంగా మైనారిటీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.