తెలంగాణ

పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణలో పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని బీ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని బీజేపీ బృందం గురువారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కోరింది. ముఖ్యమంత్రి 2018 మే 16న ఉద్యోగ సంఘాల నాయకులతో హామీ ఇచ్చినట్టు 11వ పీఆర్సీని జూలై 1 నుండి కాకుండా 2018 జూన్ 2వ తేదీనుండే అమలుచేయాలని కోరారు. 10 వ పీఆర్సీ ప్రతిపాదన మేరకు 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను వర్తింప చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్లకు తెలంగాణ ఇనె్సంటివ్ ప్రకటించాలని అన్నారు. హెల్త్ కార్డుల ద్వారా చికిత్సలు అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే విధంగా చర్యలు చేపట్టాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని అన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు న్యాయమైన అడ్డంకులను తొలగించి గానీ లేదా ఆయా యాజమాన్యాల వారీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలను కూడా వెంటనే చేపట్టాలని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. మోహన్‌రెడ్డి వెంట పీ సరోత్తం రెడ్డి, పీ వెంకటరెడ్డి తదితరులున్నారు.