తెలంగాణ

జనరల్‌కు కరీంనగర్ కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కోటాకు కేటాయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఈ మేరకు అక్కడి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లుగా విభజించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం పేర్కొంది. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్లు ఉంటాయని వెల్లడించింది. 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 14న ఏదైనా సమస్య ఉంటే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకోవచ్చునని ప్రకటించింది. 16న నామినేషన్ల ఉపసంహరణ, 24 ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఈనెల 27న కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. అభ్యరస్థలు ఎన్నికల సంఘం లోబడి ప్రచారాన్ని చేసుకోవచ్చునని, ఏదైనా ఎన్నికల సంఘం గీతదాటితే చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.