తెలంగాణ

పంటల బీమా పథకానికి విధానాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల బీమా యోజన (పీఎంబీవై), పునర్మిర్మాణ వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పథకాల కింద విధి విధానాలను ఖరారు చేసినట్లు రాష్ట్ర స్థాయి పంటల బీమా సమన్వయ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా అధ్యక్షత వహించారు.
రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకమిటీ, ఆర్‌బీఐ, చక్కెర, ఉద్యానవన శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు 2020-21 సంవత్సరానికి పంటల బీమా నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయింరు. ఒక గ్రామాన్ని బీమా యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని రెండు పంటలకు ఈ స్కీంను వర్తింప చేయాలని నిర్ణయించారు. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్‌తో, ఆదిలాబాద్ జిల్లాల్లో టమోటా పంటను పునర్మిర్మాణ వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలోకి తేవాలని నిర్ణయించారు.
2020-21 సంవత్సరంలో ఖరీఫ్ పంటలో వరి, జొన్నలు, మొక్కజొన్న, కందిపంట, పెసలు, మినుములు, వేరుశెనగ, సోయాబీన్, పసుపు, ఉల్లిపంటలకు ఫసలబీమా పథకం వర్తిస్తుంది. రబీ సీజన్‌లో వరి, జొన్నలు, మొక్కజొన్న, పెసలు, మినుములు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి పంటలకు బీమా పథకాన్ని వర్తింపచేస్తారు.
పునర్మిర్మాణ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మిరప, బత్తాయి. టమోటా, ఆయిల్‌పామ్ పంటలకు, రబీ సీజన్‌లో మామిడి, టమోటా పంటలకు వర్తింపప చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన స్కీంను ఆరు క్లస్టర్లలో కొననసాగిస్తారు. రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రుణ పరిమతిని, రుణ సాయాన్ని నిర్ణయిస్తాతరు. పునర్నిర్మాణ వాతావరణ ఆధారిత పంటల విషయంలో పర్యవేక్షణకు డైరక్టెర్ ఆఫ్ రీసెర్చి అగ్రికల్చర్, హార్టికల్చల్ వర్శిటీలు, బీమా కంపెనీల ప్రతినిధులతో కమిటీని నియమిసాక్తరు. క్రాప్ కటింగ్ ప్రయోగాల విధానాం అమలుపై పైలెట్ ప్రాజెక్టులను నిర్వహిస్తారు. 2019-200 సంవత్సరానికి సంబంధించి రైతుల వివరాలను సమగ్రంగా పొందుపరచాలని బ్యాంకులను ఈ కమిటీ ఆదేశించింది.