తెలంగాణ

హజ్‌కు వెళ్తే రాయితీలు.. సమ్మక్క జాతరకు వెళ్తామంటే చార్జీల పెంపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం అధిక చార్జీలు వసూలుచేయాలనుకోవడం హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేయడమేనని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ దపేర్కొన్నారు. హాజ్ యాత్రకు వెళ్తామన్నవారికి అనేక రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు హిందువులు తమ యాత్రలకు వెళ్తామనేసరికి చార్జీలను పెంచడమేమిటని ప్రశ్నించారు. హిందువులు, కట్టే పన్నులతో ముస్లింలకు రాయితీలు కల్పిస్తున్నారని ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగదని అన్నారు.
హిందువుల పవిత్ర ఉత్సవాలకు , ముఖ్యంగా అడవిబిడ్డలైన సమ్మక్క సారలమ్మ జాతరకు 50 శాతం అధికంగా బస్సు చార్జీలను వసూలు చేయడం సరికాదని అన్నారు. దీనిని విశ్వహిందూపరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రెండేళ్లకోమారు వచ్చే గిరిజన జాతరకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వకపోగా అధిక చార్జీలు వసూలు చేయడం ఏమిటని అన్నారు. రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో హిందూ ధార్మిక కార్యక్రమాలను అడ్డుకుని దేవాలయాల భూములను ప్రభుత్వం కబ్జా చేస్తోందని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి అన్నారు. దేవాలయాలు, దేవాలయాల భూములు, సంప్రదాయాలను బతికించుకునేందుకు వీహెచ్‌పీ కంకణబద్ధం కావాలని చెప్పారు. అందుకు వీలుగా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, తండాకు, పల్లెకు వీహెచ్‌పీ కార్యకలాపాలు విస్తరించాలని చెప్పారు. ప్రేమ పేరుతో ఒక దళిత అమ్మాయిని ముస్లిం యువకుడు గొంతుకోసి హలాల్ చేశారని రాష్టక్రన్వీనర్ సుభాష్ చందర్ ఆరోపించారు. ఇలాంటి హత్యల విషయంలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను పాలమూరులో ప్రారంభించినట్టు వారు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను గోపూజ చేసి ప్రారంభించినట్టు వారు చెప్పారు.