తెలంగాణ
మున్సిపోల్స్‌లోనూ అసెంబ్లీ ఫలితాలే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 12 January 2020
హైదరాబాద్, జనవరి 11: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతమవుతాయని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ తెలంగాణ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఎప్పటికీ మన నేత కేసీఆర్ అని, ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. రెబల్స్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేనదన్నారు. రెబల్స్ అనేది కొత్త కాదని, గతంలో కూడా తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారన్నారు. కుటుంబం అంటే చిన్న చిన్న తగాదాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మట్టికరుస్తాస్తాయన్నారు.