తెలంగాణ

ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ గోషామహాల్ నియోజకవర్గం శాసనసభ్యుడు రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చలో బైంసా పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేశారు. రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బైంసా ఘటనకు నిరసనగా ఈరోజు నిర్మల్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనర్‌లను పోలీసు శాఖ అప్రమత్తం చేసింది. ఆల్లర్లు వేరే ప్రాంతాలకు పాకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత జిల్లా ఎస్పీ, వివిధ కమిషనరేట్‌ల పోలీసు కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జిల్లాలోకి ఎవరూ రావొద్దని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న చిన్నపాటి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల గస్తీతో కొంత వరకు అదుపులోకి వచ్చినప్పటికీ సోమవారం వదంతుల కారణంగా మళ్లీ చెలరేగాయి. కోర్భాగల్లీ, జుల్ఫేకర్, కిసాన్, గల్లీలో ఇరు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో సోమవారం రాత్రి 8.00 గంటల నుంచి మాంగళవారం ఉదయం 7.00 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. పట్టణమంతా మూడు రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
'చిత్రం... ఎమ్మెల్యే రాజాసింగ్