తెలంగాణ

35 మున్సిపాలిటీల్లో 84 వార్డుల్లో టీఆర్‌ఎస్ ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృత్తం కాబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యదర్శి గట్టు రామచందర్‌రావు, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల ఘట్టం ముగిసేటప్పటికీ 35 మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు 84 వార్డులలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. అలాగే ఒక్క డివిజన్‌ను మొత్తంగా టీఆర్‌ఎస్సే పూర్తిగా గెలుచుకుందన్నారు. మొత్తంగా రాష్టవ్య్రాప్తంగా 700 వార్డుల్లో బీజేపీ, 400 వార్డులలో కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరని వారు గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారిగా సహకరించుకుంటున్నాయని వారు విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య ముసుగు పొత్తు కుదిరిందని ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వీరి మధ్య పొత్తు బహిరంగ రహస్యమని విమర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నా తెలంగాణలో మాత్రం మిత్రపక్షాలుగా మారిపోయాయని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా పరకాల, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్ ఖాతాలో పడ్డాయని చెప్పారు. కేడర్ లేని బీజేపీ, అభ్యర్థులు లేని కాంగ్రెస్ రాష్ట్రంలో కనీసం టీఆర్‌ఎస్‌కు పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలలో అన్నింటినీ టీఆర్‌ఎస్ గెలుచుకోవడం ఖాయమని వారు జోస్యం చెప్పారు.