తెలంగాణ

7చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 14: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 5మున్సిపాల్టీల్లో టీఆర్‌ఎస్ హవా నడిచింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియడంతో సత్తుపల్లి మున్సిపాల్టీలో 6వార్డులు, వైరాలో ఒక వార్డును టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇల్లందులో 24 వార్డులకు 225 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయటంతో అందరి దృష్టి దానిపై పడింది. అయితే 150మంది వరకు నామినేషన్లు ఉపసంహరించు కోవటంతో టీఆర్‌ఎస్ నాయకత్వం ఊపిరిపీల్చుకుంది. సత్తుపల్లి మున్నిపాల్టీలో 23వార్డులు ఉండగా 4, 5, 6, 8, 17, 18వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. వైరా మున్సిపాల్టీ 3వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. మధిరలో 22వార్డులకు గాను 67మంది పోటీలో ఉండగా ఇక్కడ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. వైరా 20వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం కావటంతో మిగిలిన 19వార్డుల్లో 73మంది బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ఇల్లందు, కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మిగిలిన పార్టీలు కొన్ని డివిజన్లలో ఐక్యంగానే పోటీ చేస్తున్నాయి. కొన్నిచోట్ల టీఆర్‌ఎస్ రెబల్స్ ప్రధాన అభ్యర్థులకు పోటీగా నిలిచారు. మున్సిపాల్టీలో టీఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించిన నేపథ్యంలో రెబల్స్‌గా నామినేషన్ వేసిన వారిలో ఎక్కువ మందిని ఉపసంహరించుకునేలా చేయటంలో వారు సఫలమయ్యారు.