తెలంగాణ

ఈసీకి పట్టని రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని, అయినా ఎన్నికల కమిషన్ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతోమాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులు సైతం దృష్టిసారించడం లేదని అన్నారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో బీజేపీ భయం పట్టుకుందని పేర్కొన్నారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, మోదీకి వస్తున్న పేరు ప్రతిష్టలు, ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా తెలంగాణ సీఎంకు బీజేపీ పుంజుకుంటోందనే భయంతో రాబోయే ఎన్నికల్లో ఈ ఫలితాలు ఎక్కడ కనిపిస్తాయోనని బీజేపీ అభ్యర్ధులను అంగబలం, అధికార బలంతో నయాన భయాన లొంగదీసుకుని వారితో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని అన్నారు. వినని వారిని కిడ్నాప్ చేయడం, వారి ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించి వారి ద్వారా ఒత్తిడి చేయించి అభ్యర్ధులు ఉపసంహరించుకునేలా చూస్తున్నారని అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, పరకాలలో బీజేపీ అభ్యర్థులను టార్కెట్ చేసి వారు ఉపసంహరించుకునేలా బెదిరించారని ఆరోపించారు. అక్కడున్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, అయినా వారు పట్టించుకోలేదని, ఎన్నికల పరిశీలకులకు కూడా నివేదికలు ఇచ్చామని, అయినా వారి నుండి కూడా స్పందన లేదని అన్నారు. పాత కేసులను తవ్వితీస్తామనే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఏది ఏమైనా గెలుచుకుని రావాలేని, లేకుంటే నేతల అంతుచూస్తామనే ధోరణిలో కేసీఆర్ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. ఏదో ఒక రీతిన అభ్యర్ధులను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నామమాత్రంగా తయారైందని, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలా తయారైందని, ఎన్నికల కమిషన్ తన అధికారాలను డైరెక్టర్ మున్సిపల్ శాఖకు దాతాదత్తం చేసిందని చెప్పారు. ప్రత్యక్షంగానే ఎన్నికల విభాగాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ఎన్నికల కమిషన్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. అందుకే పలు కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నికల కమిషన్‌కు సంపూర్ణ అదికారాలు ఉండేవని, ఏకగ్రీవం కోసం కృషి చేసిన వారిపై ఎన్నికల కమిషన్ కేసులు నమోదు చేసి, ఆయా ఎన్నికలను రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టిందని, ఇది తగదని అన్నారు. భైంసాలో అల్లర్లకు టీఆర్‌ఎస్, ఎంఐఎం కారణమని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. బైంసా దారులు చాలా దారుణమని అన్నారు.