తెలంగాణ

దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కొన్ని రాజకీయపార్టీలు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పతంగుల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్ కులస్తే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొని జండా ఎగురవేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయాలకు సంఘీభావంగా బీజేపీ మహిళా మోర్చ, యువమోర్చల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను దేశభక్తితో మిళితం చేసి సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న కార్యక్రమాలపై కొన్ని రాజకీయపార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, మతోన్మాద ఎంఐఎం , దానికి వత్తాసు పలుకుతున్న టీఆర్‌ఎస్‌లు దేశ ప్రజల్లో విషబీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. సంతోషంగా సంక్రాంతి జరుపుకోవల్సిన సమయంలో కొంత మంది మతోన్మాదులు శాంతియుతంగా ఉన్న బైంసాలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారని అన్నారు. బైంసాలో ఎంఐఎం అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పూర్తిగా ఎంఐఎంకు దాసోహం అయ్యిందని చెప్పేందుకు ఇదో నిదర్శనమని అన్నారు. బైంసాలో హింస అనంతరం పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావులను అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. మతోన్మాద శక్తుల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని , ఇప్పటికైనా సీఎం తన ద్వంద్వ వైఖరి వీడకపోతే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు , చంద్రశేఖరరావుకు పుట్టగతులుండవని పేర్కొన్నారు. తెలంగాణలో తమ కలహాలు సృష్టించేందుకు ఎంఐఎం , టీఆర్‌ఎస్‌లు కుట్రపన్నుతున్నాయని బైంసా ఎన్నికను వాయిదా వేయాలని అన్నారు.
'చిత్రం... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్