తెలంగాణ

అతి విశ్వాసం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. గెలుపు మనదేనన్న అతి విశ్వాసం కానీ అలసత్వాన్ని కానీ ప్రదర్శించవద్దని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు జరిగిన పట్టణాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని సూచించారు. ఎక్కడిక్కడ స్థానిక అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, ఒక్కో ఇంటికి కనీసం రెండు నుంచి మూడుసార్లు స్వయంగా వెళ్లి కలవాలని ఆదేశించారు. తెలంగాణ భవన్ నుంచి గురువారం పార్టీ కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల బరిలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెయ్య వార్డుల్లో, కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలకు బీ-్ఫరాలు ఇస్తామన్నా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. అలాగని గెలుపు మనదేనన్న అతి విశ్వాసంతో ఉండకుండా ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎంతో మంది అభ్యర్థులు ప్రయత్నం చేసి ఉంటారు, అయితే అంతిమంగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థి విజయం కోసం కృషి చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించిన వారందరిని కలుపుకొని సమన్వయంతో ఐక్యంగా ప్రచారం చేయాలన్నారు. తనకే టికెట్ వచ్చిందన్న అహంకారం కనబర్చవద్దని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లాలని హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు రూ. 45 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, మున్సిపాలిటీలకు భారీగా నిధులు ఇచ్చి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని
సూచించారు. పట్టణాల్లో విద్యుత్, మంచి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సరఫరా, మంచి నీటి సమస్య ఏ విధంగా ఉండేదో ప్రజలకు వివరించాలన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని 75 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేసి దేశంలోనే తెలంగాణ మున్సిపాలిటీలను అదర్శంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల కోసం కేటాయించిన నిధుల్లో 10 శాతం నిధులను గ్రీనరీ కోసం కేటాయిస్తున్నామన్నారు. ఆసరా పెన్షన్లు మొదలుకొని సాగునీటి ప్రాజెక్టుల దాకా కేసీఆర్ కిట్లు మొదులుకొని కల్యాణలక్ష్మి వరకు అమలు చేస్తున్న అనేక పథకాలను ప్రచార కార్యక్రమంలో వివరించాలని దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీపై గులాబి జెండా ఎగరాల్సిందేని కేటీఆర్ ఆదేశించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి చాడా కిషన్‌రెడ్డిని గురువారం తెలంగాణ భవన్‌కు పిలిపించుకొని అక్కడి పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఏ వార్డులో కూడా తిరుగుబాటు అభ్యర్థులంటూ ఉండరాదని, వారందరితో మాట్లాడి బుజ్జగించాలని కేటీఆర్ సూచించారు. పార్టీలో పాత, కొత్త వారంటూ వివక్ష లేకుండా ఐక్యంగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
'చిత్రం...సిరిసిల్లలో గురువారం ఐదేళ్ల అభివృద్ధిపై మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కేటీఆర్