తెలంగాణ

అభ్యర్థులపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: మున్సిపల్ ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతుండటంతో అభ్యర్థుల ఖర్చుపై, వారి ప్రచార సరళిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. ఎన్నికల కమిషనర్ వీ. నాగిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు అభ్యర్థుల ప్రచార సరళి, ఖర్చులను సేకరించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులు చేయాల్సిన ఖర్చు
గురించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ అభ్యర్థులకు వివరించింది. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ప్రధాన ప్రచారం బుధవారమే ప్రారంభం కాగా, గురువారం కూడా కొనసాగింది. బ్యానర్లు కట్టడం, హోర్డింగులు పెట్టడం, గోడలపై రాయడం తదితర రకాల ప్రచారాలు నేడు కనిపించడం లేదు. ఈ రూపంలో ప్రచారం చేయడం వల్ల వాటి లెక్కలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్న భయంతో ఈ తరహా ప్రచారాన్ని అభ్యర్థులు చేపట్టడం లేదు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలను విరివిగా వాడుతున్నారు. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో వార్డుల పరిధి తక్కువగానే ఉండటం వల్ల ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థుల ప్రచారం ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీల టికెట్లను ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు కొంతమంది రంగంలో ఉండటంతో వారి ప్రచారం కూడా ఉధృతంగానే సాగుతోంది. అభ్యర్థులపై నిఘా కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక అధికారులను నియమించింది. కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అమలు చేయడం కోసం ఎన్నికల కమిషన్ పత్యేక చర్యలు తీసుకుంది.
రంగంలో 12,898 మంది
120 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలోని 3052 వార్డులకు 12,898 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారని ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం వివరాలు అందించారు. టీఆర్‌ఎస్ తరఫున 2,972 మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున 2,616 మంది, బీజేపీ తరఫున 2,313 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ పక్షాన 347 మంది, ఎంఐఎం తరఫున 276 మంది, సీపీఐ తరఫున 177 మంది, సీపీఎం తరఫున 166 మంది రంగంలో మిగిలారు. గుర్తింపు పొందిన రాష్టస్థ్రాయి పార్టీల తరఫున 282 మంది పోటీ చేస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు 3,749 మంది పోటీలో ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 373 మంది రంగంలో మిగిలారని తెలిసింది.
ఎలక్షన్ వాచ్
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు, అభ్యర్థులు అవినీతికి పాల్పడకుండా, ధన ప్రవాహం జరగకుండా, ఓటర్లను అభ్యర్థులు కానీ పార్టీలు కానీ మభ్య పెట్టకుండా చూసేందుకు ‘తెలంగాణ ఎలక్షన్ వాచ్’ రంగంలోకి దిగింది. 30 సివిల్ సోసైటీలు కలిసి ఎలక్షన్ వాచ్‌గా ఏర్పడ్డాయి. ఈ సంస్థ ప్రతినిధులు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసి తమ అభిప్రాయం తెలిపారు. కరపత్రాలను కూడా ఎలక్షన్ వాచ్ ప్రచురించింది. ఎన్నికలు జరుగుతున్న 32 జిల్లాల్లో తమ ప్రతినిధులు పర్యటిస్తారని ప్రతినిధి బృందం తెలిపింది. ప్రతినిధి బృందానికి అవసరమైన సహకారం అందిస్తామని ఎన్నికల కమిషన్ కార్యదర్శి వి. నాగిరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఈ అంశంపై ఆదేశాలు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
'చిత్రం...ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎలక్షన్ వాచ్ ప్రతినిధులు