తెలంగాణ

‘విజన్’ లేని కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: విజన్‌లేని కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలపై విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం హాస్యాస్పదమని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విజన్ డాక్యుమెంట్ ద్వారా కాంగ్రెస్ డొల్లతనం బయటపడిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు దండే విఠల్‌తో కలిసి రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను అమలు చేయనున్నట్టు కాంగ్రెస్ తన విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ. 5 భోజనం పెడుతామని హామీ ఇవ్వడం వింతగా ఉందన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రూ. 5 భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే జానారెడ్డి స్వయంగా ఈ భోజనం చేసి బాగుందని కితాబు ఇచ్చిన విషయాన్ని పల్లా గుర్తు చేశారు. చెరువుల సందరీకరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుందని, తమ ప్రభుత్వం ఇప్పటికే మిషన్ కాకతీయ కార్యక్రమంలో చెరువులను పునరుద్ధరణ చేసిందన్నారు. అనేక చెరువులకు బండ్‌లను నిర్మించి మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చిన విషయం కాంగ్రెస్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. అన్ని పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, బస్తీ దవాఖానాలు పెడుతామని కూడా విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటికే తాము పెట్టిన వాటిని తీసేసి కొత్త వాటిని పెడతారా? అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏం చెప్పాలో కూడా తెలియని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని పల్లా దుయ్యబట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో సింహభాగం స్థానాలను టీఆర్‌ఎస్సే గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

'చిత్రం... తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న పల్లా, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్